ఇద్దరు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇక పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అనుకున్నదే ఆలస్యం ప్రియుడు, ప్రియురాలు పెళ్లి ఏర్పాట్లు కూడా ఘనంగా చేసుకున్నారు. బంధువులతో ఇళ్లంత సందడిగా మారింది. ఇక తెల్లారితే పెళ్లి అనగా వరుడికి కాబోయే భార్య ఊహించని షాక్ ఇచ్చింది. ఏకంగా పోలీసులను ఇంటికి రప్పించి మరి కాబోయే భర్తను పోలీసులకు పట్టించింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. తెల్లారితే పెళ్లి అనగా వధువు కాబోయే భర్తను అరెస్ట్ చేయించడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే వరుడు అరెస్ట్ కు దారి తీసిన పరిస్థితులు ఏంటి? పెళ్లికి ముందు అతడు చేసిన నేరం ఏంటనే పూర్తి వివరాలు ఇప్పడు తెలుసుకుందాం.
ఉత్తర్ ప్రదేశ్ గ్రేటర్ నోయిడాలోని దాద్రిలో అశిష్ ఠాగూర్ అనే యవకుడు నివాసం ఉంటున్నాడు. ఇక్కడే నివాసం ఉంటున్న ఓ యువతితో అశిష్ ఠాగూర్ పరిచయ పెంచుకున్నాడు. వీరి పరిచయం రాను రాను ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు కొంత కాలం పాటు ప్రేమించుకున్నారు. అలా వీరి ప్రేమాయణం నెలల నుంచి సంవత్సరాలు గడిచింది. ఈ సమయంలోనే ఇద్దరు అనేక సార్లు శారీరకంగా కూడా కలుసుకున్నారు. ఇక ఎలాగైన ఆ యువకుడు యువతిని పెళ్లి చేసుకోవాలని అనుకుని ఎలాగో ఆ యువతిని ఒప్పించాడు. అతనితో పెళ్లికి ఆ యువతి కూడా అంగీకరించింది. ఇక పెళ్లి కోసం ఓ మంచి రోజును చూసుకున్నారు. డిసెంబర్ 12న పెళ్లి జరగాల్సి ఉంది.
అయితే డిసెంబర్ 11న అశిష్ ఠాగూర్ తండ్రి అతడిని వెతుక్కుంటూ అతడి ఇంటికి వచ్చి నా కుమారుడు హసిన్ సైఫీ ఉండే ఇల్లు ఇదేనా అని చుట్టుపక్కల వారిని అడిగి తెలుసుకున్నాడు. ఇక్కడ ఉండేది హిసిన్ సైఫీ కాదని, అశిష్ ఠాగూర్ అని తెలిపారు. ఇక స్థానికులు అశిష్ ఠాగూర్ పొటోను అతడి తండ్రికి చూపించగా.. అవును ఇతను నా కుమారుడే.. ఇతని అశిష్ ఠాగూర్ కాదని, హసిన్ సైఫీ అని తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అనంతరం ఈ నిజం అశిష్ ఠాగూర్ ప్రియురాలికి తెలవడంతో ఆమెకు ఒక్కసారిగా దిమ్మతిరిగింది. ఫేక్ పేరుతో పరిచయం అయి మోసం చేయాలని చూసిన హసిన్ సైఫీపై ఆ యువతి కోపంతో ఊగిపోయింది. ఇంత పెద్ద మోసానికి పాల్పడిన హసిన్ సైఫీ వదిలేది లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హసిన్ సైఫీ అరెస్ట్ చేశారు. పెళ్లి పీటలెక్కాల్సిన వరుడుని పోలీసులు అరెస్ట్ చేయడం అనే అంశంగా తాజాగా తీవ్రచర్చనీయాంశమవుతోంది.