కొందరి కాపురాలు సంతోషంగా సాగుతాయి. మరికొందరి సంసారాలు అనుమానాలతో గడుస్తుంటాయి. ఇలాంటి చిన్న అనుమనంతోనే ఓ మహిళ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. పెళ్లైన నాటి నుంచి భార్యపై అనుమానంతో రగిలిపోయిన ఓ భర్త భార్యను దారుణంగా హత్య చేశాడు. ఇటీవల తమిళనాడులో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన తీవ్ర కలకలంగా మారింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. అది తమిళనాడులోని కడలూరు జిల్లా విరుదాచలం సమీపంలోని కమ్మపూరం. ఇదే గ్రామానికి చెందిన నాగరాజ్ అనే వ్యక్తికి రాజలక్ష్మి అనే మహిళతో వివాహం జరిపించారు.
భర్త మేస్త్రీ పని చేస్తుండగా, భార్య ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు వంట చేసేది. ఇక పెళ్లైన కొన్ని రోజులే వీరి కాపురం సంతోషంగా గడిచింది. అయితే పెళ్లైన ఏడాది నుంచే భార్యపై భర్తకు అనుమానం ఉండేది. ఇదే విషయమై భర్త భార్యను తీవ్రంగా వేధించేవాడు. భర్త వేధింపులు తట్టుకోలేక భార్య పుట్టింటికి వెళ్లి కొన్నాళ్లకి మళ్లీ వచ్చేది. అలా వీరి సంసారం సాగకపోవడంతో గ్రామ పెద్దలతో పంచాయితి పెట్టించారు. పెద్దల తీర్పుతో కొన్నాళ్లు బాగానే ఉన్నా.. కథ మళ్లీ మొదటికొచ్చేది. ఇలా కొన్నేళ్లు వీరి జీవితం గొడవలతోనే సాగుతుండేది.
ఇది కూడా చదవండి: Chennai: భర్త కళ్లుగప్పి భార్య ప్రియుడితో జల్సాలు.. క్లైమాక్స్ లో భార్యకు దిమ్మతిరిగే షాక్!
అయితే ఈ మధ్యకాలంలో భర్త గొడవ చేయడంతో భార్య పుట్టింటికి వెళ్లింది. ఎంతకు కూడా తిరిగిరాకపోవడంతో భర్త అత్తామామలకు సర్దిచెప్పి భార్యను తన ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. దీంతో ఇక నుంచైనా భర్త బుద్దిగా ఉంటాడేమోనని భార్య కూడా అనుకుంది. కానీ భర్త ప్రవర్తనలో ఎలాంటి మార్పులు రాలేదు. ఇటీవల భార్యతో భర్త మరోసారి గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య గొడవ తీవ్రరూపం దాల్చింది. ఇక కోపంతో రంకెలేసిన భర్త భార్య కాళ్లు, చేతులు కట్టేసి కత్తితో గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు.
అనంతరం అక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. నా భార్య నాపై దాడి చేసేందుకు ప్రయత్నించిందని, అందుకే ఆమెను హత్య చేశానంటూ పలుకులు పలికాడు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి మృతదేహాన్నిపోస్ట్ మార్టంకి తరలించి భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.