వాళ్లిద్దరు భార్యాభర్తలు. వీరికి పెళ్లై చాలా కాలం అవుతుంది. కొన్నేళ్లకి భర్త అనారోగ్యానికి గురై మంచానికే పరిమితమయ్యాడు. దీంతో భార్యకు భర్తతో పడక సుఖం దక్కలేదు. ఈ క్రమంలోనే భార్య తను పని చేసే చోట మరో మగాడితో తెర వెనుక ప్రేమాయణాన్ని నడిపించింది. ఇక ఆమె సాగిస్తున్న ఈ చీకటి వ్యవహారం భర్తకు తెలియకుండా తగు జాగ్రత్తలు తీసుకుంది. కానీ చివరికి భర్త తండ్రికి తెలిసింది. ఎన్నోసార్లు పద్దతి మార్చుకోవాలని మామ కోడలికి చెప్పి చూశాడు. అయినా కోడలు తన బుద్ది మాత్రం మార్చుకోలేదు. ఇక తన పరువు బజారున పడుతుందని మామ కోడలిని దారుణంగా హత్య చేశాడు.
ఇటీవల చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడు తేన్ కాశీ జిల్లా సెంగొట్టాయి పరిధిలోని లాలగుడిఇరివు గ్రామం. ఇక్కడే నివాసం ఉంటున్న ఇసాకిరాజ్ అనే వ్యక్తి గతంలో ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. కొంత కాలం పాటు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. అలా కొంత కాలానికి ఇసాకిరాజ్ తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో అతని భార్య భర్తకు విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకుంది. ఇక కొన్నేళ్ల తర్వాత ఇసాకిరాజ్ సైతం పద్మావతి అనే మహిళను మరో వివాహం చేసుకున్నాడు.
పద్మావతి భర్త ఇసాకిరాజ్ తో కొంత కాలం పాటు సంసారం చేసింది. ఇక ఇసాకిరాజ్ మంచానికే పరిమితమవ్వడంతో పద్మావతికి భర్తతో పడక సుఖం దక్కలేదు. పైగా ఆర్థికంగా వీరి కుటుంబం నడవడం ఇబ్బందిగా మారడంతో పద్మావతి స్థానికంగా ఓ చోట పనికి కుదిరింది. అలా కొంత కాలానికి పద్మావతి పని చేసే చోట ఓ యువకుడితో పరిచయం పెంచుకుంది. ఈ పరిచయమే చివరికి వివాహేతర సంబంధంగా రూపుదాల్చింది. అలా వీరి చికటి సంసారం రోజుల నుంచి సంవత్సరాలు గడిచింది. ఇక పద్మావతి తన భర్తకు తెలియకుండా ప్రియుడితో సీక్రెట్ రొమాన్స్ లో హద్దులు దాటింది. ఇదే విషయం ఎట్టకేలకు పద్మావతి భర్త తండ్రికి తెలిసింది.
పద్దతి మార్చుకోవాలని మామ పద్మావతికి అనేక సార్లు చెప్పి చూశాడు. కానీ కోడలి ప్రవర్తనలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. దీంతో కోపంతో ఊగిపోయిన మామ.. నా ఉన్న పరువును కోడలు బజారును పడేస్తుందని ఆవేశంతో ఊగిపోయాడు. ఇక లాభం లేదనుకుని.., మామ కోడలు పద్మావతిని ప్రాణాలతో లేకుండా చేయాలనుకున్నాడు. ఇందులో భాగంగానే పక్కా ప్లాన్ తో వెళ్లిన మామ ఇటీవల కోడలు నిద్రపోతుండగా గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.