ఆమె పేరు రమణి. మదురై జిల్లాలోని ఓ ప్రాంతంలో గ్రామ పరిపాలన అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. కొంత కాలం పాటు ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు. అలా సేవలు అందిస్తున్న క్రమంలోనే ఆ మహిళా అధికారి ఏకంగా ఆఫీసులోనే ఊహించని పాడుపనికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి రావడంతో స్థానికులు అంతా ఒక్కసారిగా షాక్ కు గురవుతున్నారు. అసలు ఈ మహిళ అధికారి కేవలం రూ.250 కక్కుర్తిపడి ఎలాంటి నీచానికి పాల్పడింది? అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
అది తమిళనాడులోని మదురై జిల్లా యాగప్ప పట్టణం పరిధిలోనే పంచవర్ణం ప్రాంతం. ఇదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో ఓ మహిళకు గతంలో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతులు బాగానే ఉన్నారు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.., ఉన్నట్టుండి గత కొన్నేళ్ల క్రితం భర్త భార్యను వదిలి వెళ్లిపోయాడు. దీంతో అప్పటి నుంచి భార్య ఒంటరిగానే ఉంటూ జీవనాన్ని కొనసాగిస్తుంది. ఇక భర్త లేకపోవడంతో ఆ మహిళ పూటగడవడమే కష్టంగా మారింది. అయితే ఈ క్రమంలోనే భర్తను వదిలేసిన మహిళలను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆ మహిళ తెలుసుకుంది. దీంతో ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఓ సర్టిఫేట్ కోసం గ్రామ పరిపాలన అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న రమణి వద్దకు వెళ్లింది.
దీంతో సర్టిఫికేట్ కావాలని ఆ ఆధికారిని ఆ మహిళ అడగింది. దీంతో ఆ మహిళా అధికారి కొన్ని రోజుల పాటు ఆ మహిళను తిప్పించుకుంది. ఇలా అయితే పని జరగదని.. లంచం ఇవ్వాల్సిందేనంటూ ఆ మహిళ అధికారి తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న ఆ మహిళ.., ఓ వాలంటీర్ ను సంప్రదించింది. ఆ మహిళ అతడికి అన్ని విషయాలు చెప్పింది. ఇక అనంతరం ఆ మహిళ వాలంటీర్ ఆదేశాల మేరకు… వాలంటీర్ చెప్పినట్లుగానే రూ.250 ఆ గ్రామ అధికారికి ఇచ్చింది. దీనిని ఆ వాలంటీర్ వీడియో తీశాడు. సర్టిఫికేట్ ఇవ్వడానికి లంచం తీసుకోవాలా అని వాలంటీర్ ప్రశ్నించగా.. మా అధికారులు అలా తీసుకుని ఏకంగా భవనాలే నిర్మించుకున్నారు. నేను అలా అడగలేదు కదా అంటూ ఆ మహిళా అధికారి సమాధానం ఇచ్చింది. అనంతరం వాలంటీర్ స్పందిస్తూ.. ఈ వీడియోను నేను జిల్లా కలెక్టర్ కు పంపుతానని చెప్పడంతో ఆ మహిళా అధికారి నోట్లో నీళ్లు నమిలింది. అంత పని చేయకు అని కాళ్ల, వేళ్ల పడుతూ నన్ను క్షమించు అంటూ వేడుకుంది. ఇక ఇదే వీడియో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది.