చెన్నైలో దారుణం చోటు చేసుకుంది. కొందరు దుండగులు బరితెగించి ప్రవర్తించి ఓ అమాయకపు యువకుడి మరణానికి కారణం అయ్యారు. అతని ప్రైవేట్ పార్ట్స్ మీద దాడి చేయడంతో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు ఈ యువకుడిని అంత దారుణంగా ఎందుకు కొట్టిచంపారు? అతడు చేసిన నేరమేంటనే పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
తమిళనాడులోని త్రీచి-మధురై హైవే పరిధిలోని మణికందంలో ఓ వ్యక్తి ఓ కోత మిల్లును నడిపిస్తున్నాడు. ఈ మిల్లులో ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది వ్యక్తులు కార్మికులుగా పని చేస్తూ ఉన్నారు. అయితే ఇదే మిల్లులో ఇటీవల దొంగతనం జరిగిందని అందులో పని చేస్తున్న కొందరు కార్మికులు పసిగట్టారు. చివరికి దొంగనతానికి పాల్పడింది చక్రవర్తి వ్యక్తి అని తెలుసుకున్నారు. ఇక అందులో పనిచేసే కొందరు కార్మికులు అతడిని పట్టుకుని స్థానికంగా ఓ చెట్టుకు కట్టేశారు. అనంతరం అతడిపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు.
ఇక ఇంతటితో ఆగకుండా అతని మర్మాంగాలపై కూడా దాడి చేయడంతో తట్టుకోలేక ఆ వ్యక్తి మరణించాడని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం ఈ వ్యక్తిపై దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులతో పాటు ఆ మిల్లు ఓనర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరణించిన వ్యక్తి మర్మాంగాలపై గట్టిగా దెబ్బలు తాకిన కారణంగా ఆ వ్యక్తి మరణించినట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.