వివాహేతర సంబంధం.. ఇవే దంపతుల జీవితాలను నాశనం చేస్తూ చివరికి హత్యలు, ఆత్మహత్యల వరకు తీసుకెళ్తోంది. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ పూజారీ స్థానికంగా ఉండే ఓ భర్తలేని మహిళతో అక్రమ సంబంధాన్ని కొనసాగించాడు. ఆ మహిళ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇద్దరూ కొంత కాలం పాటు బాగానే ఎంజాయ్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే జరిగిన ఓ ఊహించని పరిణామంతో పూజారీ కిరాతకానికి పాల్పడ్డాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటన ఎక్కడ జరిగింది? అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది తమిళనాడులోని ఓ ప్రాంతం. ఇక్కడే నివాసం ఉంటున్న ఓ మహిళకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. కొంత కాలం తర్వాత ఆమె భర్త మరణించాడు. దీంతో ఆ మహిళ అప్పటి నుంచి ఒంటరిగా ఉంటూ జీవితాన్ని సాగదీస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే స్థానికంగా ఉంటున్న ఓ పూజారీ ఆ ఒంటరి మహిళపై కన్నేశాడు. ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇద్దరు వివాహేతర సంబంధాన్ని కొనసాగించారు. అలా కొంత కాలం పాటు ఇద్దరూ బాగానే ఎంజాయ్ చేస్తూ వచ్చారు. ఇదిలా ఉంటే గత కొంత కాలం నుంచి ఆ మహిళ పూజారీని కాదని మరో వ్యక్తితో అక్రమ సంబంధాన్ని కొనసాగించింది. ఈ విషయం పూజారీకి తెలిసింది.
ఇక ఒంటికాలుపై లేచిన పూజారీ తన ప్రియురాలిని హత్య చేయాలని ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగానే పూజారీ ఈ నెల 27న ఆ మహిళను రాత్రి పొలానికి రమ్మన్నాడు. ప్రియుడు కోరిక మేరకు ఆ మహిళ పొలానికి వచ్చింది. రాగానే పూజారీ రాడ్డుతో ఆ మహిళను దారుణంగా కొట్టి చంపాడు. ఇక మహిళను కొట్టి చంపిన విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం అనుమానాస్పద మృతిగా కింద కేసు నమోదు చేసుకుని అన్ని దర్యాప్తు చేపట్టగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడి పూజారీ ఆ మహిళను కొట్టి చంపాడని తేలడంతో పోలీసులు పూజారీని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.