ఆమెకు ఈ మధ్యకాలంలోనే వివాహం జరిగింది. పెళ్లైన కొంత పాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం బాగానే సాగింది. ఇలా వీరి జీవితం సంతోషంగా సాగుతున్న తరుణంలోనే ఉన్నట్టుండి ఆ మహిళ భర్త మరణించాడు. ఇక భర్త చనిపోవడంతో ఆ మహిళ కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. అలా కొన్ని రోజులు ఆ మహిళ భర్తలేని జీవితాన్ని గడుపుతూ ఉంది. ఈ క్రమంలోనే ఓ గుర్తు తెలియని వాట్సాప్ నుంచి ఆమె ఫోన్ కు కొన్ని ఫొటోలు వచ్చాయి. ఆ ఫొటోలోను చూసిన ఆ మహిళ ఒక్కసారిగా షాక్ కు గురైంది. దీంతో వెంటనే పోలీసుల ఫిర్యాదు చేసింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఆ మహిళకు ఏం ఫొటోలు పంపారు? అసలు ఈ ఘటనలో ఏం జరిగిందనే పూర్తి వివారాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది తమిళనాడు సెలం జిల్లాలోని పాపంపట్టి ప్రాంతం. ఇక్కడే మణికందన్, వరద రాజన్ అనే ఇద్దరు స్నేహితులు నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉండేవారు. అయితే క్రమంలోనే ఈ యువకులకు కొన్ని పాడు ఆలోచనలు పుట్టుకొచ్చాయి. ఇదిలా ఉంటే విరుంబాక్కంలోని ప్రాంతంలో ఓ మహిళ నివాసం ఉంటుంది. ఇటీవలే ఆ మహిళ భర్త మరణించాడు. దీంతో అప్పటి నుంచి ఆ మహిళ ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఉంది. ఇదే విషయాన్ని మణికందన్, వరద రాజన్ యువకులు తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆమె సోషల్ మీడియా ఖాతాలకు రిక్వస్ట్ పెట్టి తెలిసిన వ్యక్తుల సాయంతో ఆమె ఫోన్ నెంబర్ ను సంపాదించారు. ఇక ఒకరి తర్వాత ఒకరు మణికందన్, వరద రాజన్ ఇద్దరూ ఆ మహిళకు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడడం మొదలు పెట్టారు.
దీంతో షాక్ కు గురైన ఆ మహిళ మరోసారి నాకు ఫోన్ చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వార్నింగ్ ఇచ్చింది. ఇక మరుసటి రోజు ఆ యువకులు ఆ మహిళ ఫోన్ కు ఆమె ఫొటోలతో మార్పింగ్ చేసి అసభ్యకరమైన ఫొటోలు పంపారు. ఈ ఫొటోలను చూసిన ఆ మహిళ ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఆ తర్వాత మళ్లీ ఫోన్ చేసి మా కోరిక తీర్చాలని, లేకుంటే నీ ఈ ఫొటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తామని లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. దీంతో అలెర్ట్ అయిన ఆ మహిళ వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితులను అరెస్ట్ చేశారు. అయితే ఈ దుండగులు మంది భర్తలు లేని మహిళలను టార్గెట్ చేసుకుని లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. మా కోరిక తీర్చాలని, లేకుంటే మీ ఫొటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నామని బ్లాక్ మెయిల్ కు దిగుతున్నారని పోలీసులు తెలిపారు. ఇలా ఎంతో మంది భర్తలు కోల్పోయిన మహిళలను వేధిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.