ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు నిర్మల. గత కొన్నేళ్ల కిందట శ్రీనివాస్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. అంతా సంతోషంగా ఉందనుకున్న తరుణంలోనే భర్త అసలు రూపం బయటపడింది. ఇక కట్టుకున్న పెళ్లాం అని చూడకుండా ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలగా మారుతోంది. ఈ దారుణ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.
సూర్యాపేట జిల్లాలోని బాలాజీ నగర్ ప్రాంతం. ఇక్కడే దాసరోజు శ్రీనివాస్, నిర్మల అనే దంపతులు నివాసం ఉంటున్నారు. గతంలో వీరిద్దరికి వివాహం జరిగింది. భర్త లారీ డ్రైవర్ గా పని చేస్తుండగా, భార్య కుట్టుమిషన్ కుడుతుంది. ఇలా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటూ సంసారాన్ని నెట్టుకొచ్చారు. అలా కొన్నేళ్లు గడిచింది. ఎలాంటి గొడవలు లేకుండా అప్పటి వరకు ఈ దంపతుల కాపురం బాగానే సాగింది. ఇక అంతా బాగానే ఉందనుకుంటున్న క్రమంలోనే భర్త శ్రీనివాస్ అసలు క్యారెక్టర్ బయటపడింది. దీంతో తరుచు ఏదో విషయమంపై భార్యను వేధింపులకు గురి చేసేవాడు. కట్టుకున్న పెళ్లాం అని చూడకుండా అనేక వేధింపులకు పాల్పడుతూ హింసించేవాడు. అయితే ఇదే విషయమై భార్యాభర్తలు తరచు గొడవ పడేవారు. భార్య మాత్రం భర్తకు నచ్చజెప్పే ప్రయత్నం చేసేది. కానీ భర్త అవేం పట్టించుకోకుండా అలాగే వేధించేవాడు.
ఇక భర్త ప్రవర్తనతో విసుగు చెందిన నిర్మల ఊహించని నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిర్మల ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుంది. అప్పుడే ఇంటికి వచ్చిన భర్త మంటలను ఆర్పే ప్రయత్నం చేశాడు. కానీ ఫలితం లేకపోవడంతో నిర్మల మంటల్లో కాలి ప్రాణాలు విడిచింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత భర్త శ్రీనివాస్ పైనే అనుమానం ఉందని స్థానికులు చెప్పడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.