సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో 6 ఏళ్ళ చిన్నారిపై అఘాయిత్యం చేసి, ఆమెని చంపేసిన నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. స్టేషన్ ఘనపూర్ మండలంలోని పామునూరు దగ్గర రైల్వే ట్రాక్ పై రాజు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. రాజు చేతిపై ఉన్న టాటూని చూసి, ఆ బాడీ రాజుదే అని పోలీసులు నిర్ధారించుకున్నారు. రాజు చేతిపై మౌనిక అనే పేరు పచ్చబొట్టు వేసి ఉంటుంది. ఇప్పుడు ఇదే రాజు బాడీని గుర్తించడంలో కీలకం అయ్యింది.
చిన్నారి చనిపోయిన విషయం తెలిశాక సోషల్ మీడియాలో, మీడియాలో రాజుకి సంబంధించిన పిక్స్ వైరల్ అయ్యాయి. అతను ఎక్కడికి వెళ్లినా సీసీటీసీ కెమెరాలు అతన్ని బంధిస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలో తాను ఎప్పుడైనా పోలీసులకి చిక్కడం గ్యారంటీ అనుకున్న రాజు.. ఇలా ట్రైన్ కింద పడి ప్రాణాలను తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి రాజు ఇలా చనిపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.