సభ్య సమాజం తల దించుకునే దారుణమైన పనికి ఒడిగట్టారు కొందరు వ్యక్తులు. తమ భార్యలను మార్చుకుని పాడుపనికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా వాటిని వీడియోలు కూడా తీశారు. తమ భార్యలకు మత్తు మాత్రలు ఇచ్చి ఈ అఘాయిత్యం చేశారు. తాజాగా, ఈ కేసుకు సంబంధించి కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఆ భర్తల్ని దోషులుగా తేల్చి శిక్షలు ఖరారు చేసింది. సింగపూర్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 2010 మధ్య కాలంలో సింగపూర్‌కు చెందిన నలుగురు వ్యక్తులకు ఆన్‌లైన్ ద్వారా పరిచయం అయింది. కొన్ని రోజులు చాటింగ్ చేసుకున్న వీరి అభిరుచులు ఒక్కటయ్యాయి.
అప్పుడప్పుడు వీరు మందు పార్టీలు చేసుకునేవారు. ఈ నేపథ్యంలోనే వారికి ఓ పాడు ఆలోచన వచ్చింది. ఒకరి భార్యలను ఒకరు మార్చుకుని కోర్కెలు తీర్చుకుందాం అనుకున్నారు. భార్యలకు తెలిస్తే ఈ పనికి ఒప్పుకోరని భావించారు. వారిని మత్తులో పడేసి తమ పని కానివ్వాలి అనుకున్నారు. వీరికి ఓ బ్యాచిలర్ హెల్ప్ చేశాడు. వారి భార్యలను మత్తులోకి దించటానికి మత్తు మాత్రలు ఇచ్చాడు. వారందరూ తమ భార్యలకు మత్తు మందు ఇచ్చారు. స్ప్రహ తప్పిపడిపోయిన తర్వాత ఒకరి భార్యను మరొకరు మార్చుకుని పాడు పనికి పాల్పడ్డారు. అంతేకాదు.. ఆ పాడు పనుల్ని వీడియో కూడా తీశారు.
2010-2018 వరకు ఈ దారుణం జరిగింది. ఓ రోజు నలుగురు మహిళల్లోని ఓ మహిళ మత్తు మందు ఇచ్చినా నిద్ర లేచింది. జరిగిన ఘోరాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితులందరినీ అరెస్ట్ చేశారు. ఇక అప్పటినుంచి కోర్టులో కేసు నడుస్తోంది. 2022, అక్టోబర్ 31న కోర్టు ఈ కేసుకు సంబంధించి తుది తీర్పును వెలువరించింది. మొత్తం ఐదుగురికి వారి తప్పు మేరకు శిక్షలు విధించింది. ప్రస్తుతం ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.