మూడుమళ్ల బంధంతో ఒక్కటై ఏడడుగులు నడిచారు. కలకాలం కలిసి జీవించాలనుకుని ఉన్న దాంట్లో ఆ దంపతులు సంతోషంగా బతుకున్నారు. ఇలా ఎంతో అందంగా సాగుతున్న వీరి దాంపత్య జీవితం ఒక్కసారిగా ఊహించని ముగింపుకు చేరుకుంది. ఉన్నన్ని రోజులు కలిసి జీవించారు, చివరికి కలిసే మరణించారు. తాజాగా వెలుగు చూసిన ఈ దంపతుల మరణం స్థానికుల కంట కన్నీరు తెప్పిస్తుంది. అసలు ఈ ఘటనలో ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అది పెద్దపల్లి జిల్లా ఏలిగేడు మండలం సుల్తానాపూర్.
ఇదే గ్రామంలో జాతరగొండ ఓదెలు (40), రజిత(36) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందట పెళ్లై ఇద్దరు కుమార్తెలు జన్మించారు. అయితే ఉన్న రెండెకరాల పొలంలో ఈ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇదిలా ఉంటే వీరి పొలంలో పంటకు పురుగు పట్టడంతో పిచికారి చేసేందుకు మంగళవారం ఉదయం ఓదెలు, రజిత దంపతులు పొలానికి వెళ్లారు. భర్త ఓదెలు పిచికారి చేస్తుండగా భార్య రజిత భర్తకు సాయంగా నిలిచింది. అయితే పిచికారి చేసి తిరిగి వస్తానని భర్త చెప్పడంతో పొలంలో భార్య రజిత ఓ చోట కూర్చుకుంది.
చాలా సేపు గడిచినా భర్త ఇంకా రాకపోవడంతో భార్య రజితకు అనుమానం వచ్చి భర్తకు వద్దకు వెళ్లింది.
తొందర తొందరలో భార్య వెళ్లి చూడగా భర్త ఓదెలు తెగిపడ్డ కరెంట్ తీగకు తగిలి భర్త ఓదెలు కరెంట్ షాక్ తో ప్రాణాలు విడిచాడు. దీనిని గమనించిన భార్య ఏడుస్తూ భర్తను పైకి లేపే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే భార్య రజిత కూడా కరెంట్ షాక్ కు గురై ప్రాణాలు విడిచింది. దీనిని గమనించిన స్థానికులు వెంటనే విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి విద్యుత్ నిలిపివేశారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విగత జీవిలో పడి ఉన్న ఓదెలు, రజిత దంపతుల మృతదేహాలను పరిశీలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దంపతులు ఇద్దరు ఒకేసారి కరెంట్ షాక్ గు గురై మరణించడంతో కుటుంభికులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ విషాద ఘటనతో గ్రామస్తుల కంట కన్నీరు ఆగడం లేదు.