ఇష్టపడి పెంచుకున్న కుక్క మరణించిందని తెలుసుకున్న ఓ యువకుడు తీవ్ర మనో వేదనకు గురయ్యాడు. కంటికి రెప్పలా పెంచుకున్న కుక్క లేకపోవడంతో ఈ నిజాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్ ఓల్డ్ అల్వాల్ లో రిట్రీట్ కాలనీలో విష్ణునారాయణ(20) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. బీబీఏ చివరి సంవత్సరం చదువుతున్న విష్ణునారాయణ.., అతను ఎంతో ఇష్టంగా పెంచుకున్న కుక్క గత రెండు నెలల కిందట మరణించింది.
అయితే అప్పటి నుంచి ఆ యువకుడు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. నా శునకం లేని జీవితం నాకు వద్దు అనుకున్నాడో ఏమో తెలతియదు కానీ, రెండు సార్లు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి అతడిని రక్షించారు. అయితే మంగళవారం కూడా ఇంట్లో ఎవరూ లేని టైమ్ లో ఆ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పెంపుడు కుక్క మరణించిందని ఆత్మహత్యకు పాల్పడ్డ యువకుడి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.