ఇద్దరు యువతులు.. అందునా వరుసకు వదినా మరదళ్ళు. పరిచయమయ్యారు. ఒకరంటే మరొకరికి పడి చచ్చే అంత ప్రేమ చిగురించింది. మనవాడాలనుకున్నారు. కానీ, పెద్దలు అందుకు అంగీకరించలేదు. ఇద్దరు పెళ్లి చేసుకొని ఏం చేస్తారంటూ దండించారు. అది వీరికి నచ్చలేదు. ఇంట్లో నుండి వెళ్ళిపోయి సహజీవనం చేయడం మొదలుపెట్టారు. ఇంతలో వీరి జీవితంలోకి మూడో వ్యక్తి ఒంటరయ్యాడు. ఇక్కడినుండి.. వీరి ప్రేమ కథా చిత్రం ఎన్నో మలుపులు తిరిగింది. ఏంటన్నది తెలియాలంటే కింద చదివేద్దాం..
వాళ్లిద్దరూ అమ్మాయిలు.. అందునా వరుసకు వదినా మరదళ్లు. ఒకరికొకరు పరిచయం అయ్యారు. ప్రకృతికి విరుద్ధమైనప్పటికీ మనుషులు కలిశాయి. వివాహబంధంతో ఒక్కటై జీవితం పంచుకోవాలని అనుకున్నారు. పెద్దలను ఎదురించి ఒక ఇంట్లో సహజీవనం చేయడం మొదలుపెట్టారు. కానీ ఇంతలో మూడో వ్యక్తి వారి జీవితంలోకి ఎంట్రీ ఇచ్చాడు. అందులో ఒక యువతికి నువ్వే నా ప్రాణమంటూ ప్రేమపాఠాలు చెప్పి దూరం చేసే ప్రయత్నం చేశాడు. దీన్ని భరించలేని సహజీవనం చేస్తున్న యువతి.. మరో యువతిని హత్యచేసింది. మొదట నుంచి చివరకు అంతటా ప్రకృతికి విరుద్దంగా సాగిన ఈ ప్రేమకథ చిత్రంలో ఎన్నో ట్విస్టులున్నాయి. ఆ వివరాలు..
మంచిర్యాల జిల్లా మన్నెగూడం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి అయిదుగురు ఆడపిల్లలు. వీరిలో నాలుగో కుమార్తె పేరు.. మహేశ్వరి. ఈ అమ్మాయి చిన్నతనం నుంచి అబ్బాయిలా నడుచుకునేది.. అబ్బాయిలాగే వేషధారణ చేసుకునేది. ఈ క్రమంలో.. మందమర్రి మండలం మామిడిగట్టుకు చెందిన సల్లూరి అంజలి (21) మన్నెగూడంలోని తన అమ్మమ్మ ఇంటికి వస్తుండేది. అలా వస్తూ.. పోతూ ఉన్న క్రమంలో..మహేశ్వరి అలియాస్ మహేష్‌తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ వరుసకు వదినా మరదళ్లు. ఈ క్రమంలోనే వరుసకు మరదలు అయిన అంజలిని మహేశ్వరి ఇష్టపడింది. అంజలి కూడా మహేశ్వరి ప్రేమించింది. ఇద్దరి మనసులు కలవడంతో పెండ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికి పెద్దలు అంగీకరించకపోవడంతో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లో ఒక రూం అద్దెకు తీసుకుని కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు.
అంజలి స్థానిక కళ్లద్దాల దుకాణంలో పనిచేస్తుండగా.. మహేశ్వరి ఓ పెట్రోల్ బంకులో పనిచేచేస్తూ ఉండేది. ఇక్కడివరకు ఎలా ఉన్న.. శ్రీనివాస్ అనే వ్యక్తి ఎంట్రీతో వీరి ప్రేమ కథా చిత్రం పూర్తిగా మారిపోయింది. మొదట మంచిర్యాలలో కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న శ్రీనివాస్‌తో మహేశ్వరికి పరిచయమైంది. కొన్నాళ్లకు అతడికి అంజలితోనూ మాటలు కలిశాయి. ఆపై అంజలి శ్రీనివాస్‌తో సన్నిహితంగా ఉంటూ మహేశ్వరిని దూరం పెడుతూ వచ్చింది. ఇది మహేశ్వరికి నచ్చలేదు. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. దీంతో మహేశ్వరి పగ పెంచుకుంది. బుధవారం రాత్రి అంజలి విధులు ముగించు ఇంటికి రాగా, 10 గంటల సమయంలో మామిడిగట్టుకు వెళ్దామంటూ.. మహేశ్వరి ద్విచక్ర వాహనంపై తనని వెంటబెట్టుకెళ్ళింది.
ఆ తరువాత ఇద్దరి మధ్య ఏం జరిగిందో కానీ.. రాత్రి 11.30 గంటల సమయంలో శ్రీనివాస్‌కు మహేశ్వరి ఫోన్ చేసి.. అంజలి ఆత్మహత్య చేసుకుందని.. తాను కూడా చనిపోతున్నానని చెప్పింది. వెంటనే అప్రమత్తమైన శ్రీనివాస్ గుడిపల్లి గ్రామ శివారులోని సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే వీరిద్దరూ తీవ్ర గాయాలతో చెల్లాచెదురుగా పడి ఉన్నారు. దీంతో వారిద్దరిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. అప్పటికే అంజలి మరణించినట్లు తెలిపారు. అంజలి మెడపై లోతైన గాయం ఉండడంతో మహేశ్వరి ఆమెను హత్య చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి మహేశ్వరి, శ్రీనివాస్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని అన్ని కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రకృతి విరుద్ధ ప్రేమపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.