సైదాబాద్ సింగరేణి కాలనీ చిన్నారి హత్యాచారం ఘటనలో నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. స్టేషన్‌ఘన్పూర్ రైల్వే ట్రాక్‌పై నిందితుడు రాజు మృతదేహం పోలీసులకు లభించింది. చేతిపై ఉన్న ‘మౌనిక’ అనే పచ్చబొట్టు సాయంతో పోలీసులు నిందితుడు రాజుగా నిర్ధారించారు. దాదాపు వారంరోజులపాటు పోలీసులకు కునుకు లేకుండా చేసిన రాజు మృతదేహంగా లభించడంతో ఇటు పబ్లిక్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అసలు రాజు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అన్న ప్రశ్న మీద సమాధానాల కోసం పోలీసులు దృష్టి సారించారు.
ఘటన జరిగిన దాదాపు రెండ్రోజుల వ్యవధిలోనే మీడియా, సోషల్ మీడియా వేదికల్లో దావానలంలా వ్యాపించింది. ఎక్కడ చూసినా రాజు చిత్రాలే. తన అవతారాన్ని మార్చుకుని ఉంటాడనే అనుమానంతో పోలీసులు ఎన్నో ఊహాచిత్రాలను తయారు చేసి ప్రచారం చేశారు. అంత ప్రచారంతో జరగటంతో రాజుకు తలదాచుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. సాధారణ ప్రజల నుంచి పోలీసుల వరకు అందరూ వెతుకున్నారు. ఎటెళ్లాలో తెలీక, ఎక్కడ తల దాచుకోవాలో తెలీక ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు.
దాదాపు వెయ్యిమంది పోలీసులు నిందితుడు రాజు కోసం గాలింపుచర్యలు చేపట్టారు. హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాలను జల్లెడపట్ట సాగారు. అది ముందే గ్రహించి సిటీ దాటేశాడు రాజు. అది కూడా ముందే గ్రహించి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మొత్తం ఆర్టీసీ డ్రైవర్లు, కండెక్టర్లు, బస్‌స్టాండ్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. మరోవైపు పోలీసులు సిటీ దాటేసుంటే ఎక్కడున్నా సమాచారం తెలుస్తుందని నగదు బహుమతి ప్రకటించారు. మొన్నీమద్యలో ఎప్పుడూ ఏ నిందితుడి కోసం హైదరాబాద్ పోలీసులు రూ.10 లక్షల రివార్డు ప్రకటించలేదు. తెలంగాణలో ఏ మూలకు వెళ్లినా రాజు కనిపిస్తే తప్పకుండా సమాచారం వస్తుంది. ఎవరి సాయం తీసుకోవాలన్నా డబ్బుకోసం అతని ఆచూకీ చెప్పేస్తారనే భయం ఉంటుంది. రాజుకు మరో దారి లేకుండా పోయింది. తన ముఖం ఈ సమాజానికి చూపించే అవకాశం లేకుండా పోయింది.
అంతటి విషాద ఘటన గురించి తెలుసుకున్న ప్రతిఒక్కరి కళ్లు చెమ్మగిల్లాయి. రాజు ఎక్కడకనిపిస్తే అక్కడ ముందు చంపేసి తర్వాత సమాచారం ఇవ్వండంటూ ప్రచారాలు జరుగుతున్నాయి. కొందరైతే ఉద్యోగాలకు సెలవులు పెట్టి మరీ వెతుకులాట సాగించారు. అందరి కోరిక ఒక్కటే నిందితుడు రాజు బతికి ఉండకూడదు. అతడిని హింసించి చంపాలంటూ ఎందరో సోషల్ మీడియాలో ప్రచారాలు చేశారు. ఈ కోణంలో కూడా రాజుకు బతికే అవకాశం లేదు.
అన్ని రకాలుగా నిందితుడు రాజుకు బతికే అవకాశాలు మూసుకుపోయాయి. పోలీసుల చేతికి చిక్కే వరకు కూడా రాజు బతకగలడన్న నమ్మకం అతనికి లేకుండా పోయింది. అందుకే ఈ దారి ఎంచుకున్నాడని అందరూ అంటున్నారు. కొందరైతే రాజు తెలివిగా ఆత్మహత్య చేసుకున్నాడు లేకుంటే.. ప్రజల చేతిలో ఇంకా దారుణంగా మరణించి ఉండేవాడంటూ తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. ఏలాగైనా చిన్నారికి న్యాయం జరిగిందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు కొందరు.