పెళ్లి తర్వాత ఏర్పడే ప్రేమ వ్యవహారాలు విషాదాలకు కారణమవుతున్నాయి. ప్రతి నిత్యం ఎవ్వరో ఒకరు వివాహేతర సంబంధాలకు బలవుతూనే ఉన్నారు. తాజాగా, ఓ వివాహిత ప్రియుడి చేతిలో దారుణంగా హతమార్చబడింది. తన మాట కాదన్నందుకు ఆ ప్రియుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జార్ఖండ్, రామ్‌ఘర్ జిల్లా, భద్వాతంద్‌కు చెందిన మమతా అనే యువతికి కొన్నేళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. వీరికి ఓ పాప కూడా పుట్టింది. అయితే, మమత గత కొన్ని నెలలుగా అర్మాన్ అనే యువకుడితో ప్రేమ వ్యవహారం నడిపిస్తోంది.
ఈ నేపథ్యంలోనే భర్తను వదలిపెట్టి మమత తనతో పాటు వచ్చేయాలని అర్మాన్ పట్టుబడుతూ ఉన్నాడు. ఆమె ఇందుకు ఒప్పుకోలేదు. భర్త, కూతుర్ని వదిలిరావటానికి ఆమె మనసు అంగీకరించలేదు. మమత తన మాటలను లెక్క చేయకపోయేసరికి అతడికి కోపం వచ్చింది. మమతను చంపటానికి పథకం రచించాడు. మమత ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు అక్కడికి వెళ్లాడు. ఆమెతో ఈ విషయమై గొడవ పెట్టుకున్నాడు. తర్వాత ఆమెపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. అతడి దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. ఆమె నేలపై పడిపోగానే అర్మాన్ అక్కడినుంచి పరుగులు తీశాడు.
సంఘటన జరిగినపుడు అక్కడే ఉన్న మమత కూతురు తల్లిపై దాడిని చూసి గట్టిగా ఏడ్వసాగింది. ఆ ఏడుపు కారణంగా మమత సోదరి జయా దేవి అక్కడికి వచ్చింది. రక్తం మడుగుల్లో పడి ఉన్న మమతను గుర్తించింది. వెంటనే దగ్గరిలోని ఆసుపత్రికి తరలించింది. మమతను పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. ఇక, ఈ ఘటనపై జయా దేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అర్మాన్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి, లవ్ ట్రయాంగిల్ కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్న మమత ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.