ఎదుటివారి అవసరాలను అడ్డం పెట్టుకొని కోరిక తీర్చకునే వారి సంఖ్య బోలెడు. సంక్షేమ పథకాల ముసుగులో కోరిక తీర్చకునే వాలంటీర్ నుంచి మొదలుపెడితే.. పిర్యాదు చేయడానికి స్టేషన్ కి వచ్చే మహిళను లోబరుచుకుని ఖాకీల వరకు ఎందరో ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి ట్రాఫిక్ పోలీస్ కూడా చేరాడు. హెల్మెట్ ధరించని ఓ విద్యార్థినిని తన ఇంటికి వచ్చి కోరిక తీర్చాలని ఓ ట్రాఫిక్ పోలీస్ బెదిరించాడు. లేదంటే రూ.పది వేలు చలానా విధిస్తానని హెచ్చరించాడు. ఆ వివరాలు..
రాజస్థాన్, కోటా పరిధిలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో చదువుతున్న యువతి శనివారం ఉదయం స్కూటీపై వెళ్తోంది. ఈ క్రమంలో క్యాడ్ సర్కిల్ వద్ద విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కైలాష్ ఆమె వాహనాన్ని ఆపాడు. ఎందుకు హెల్మెట్ ధరించలేదంటూ ఆమెను ప్రశ్నించాడు. బైకును పక్కకి తీసుకెళ్లిన అతడు హెల్మెట్ ధరించనందుకు ఫైన్ వేయడం మానేసి.. నీకు పెళ్లి అయ్యిందా అంటూ పర్సనల్ విషయాలు అడగటం మొదలుపెట్టాడు. మొదట తనతో స్నేహం చేయాలని అడిగాడు. ఇంటి వద్ద భార్య, పిల్లలు లేరని, తన వెంట వస్తే మొబైల్ ఫోన్ గిఫ్ట్‌గా ఇస్తానని చెప్పాడు. నేను చెప్పినట్టు వినకపోతే రూ.10,000 చలానా విధిస్తానని బెదిరించాడు.
దీంతో ఏం చేయాలో అర్థం కానీ యువతి మళ్లీ కలుస్తానంటూ అక్కడి నుంచి తప్పించుకుంది. అనంతరం నేరుగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు మీడియాలో ప్రసారమవ్వడంతో పోలీసులు చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. కోరిక తీర్చకపోతే.. ఫైన్ వేస్తా అన్న ఈ ఖాకీకి.. ఎలాంటి శిక్ష విధించాలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.