పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ దంపతులు పెళ్లైన కొంత కాలం పాటు సంసార జీవితాన్ని బాగానే గడిపారు. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. రోజులు మారుతున్న కొద్ది అత్తమామల ప్రవర్తనలో మార్పు రావడం మొదలైంది. ఇదంతా మాములేనని కొన్నాళ్ల పాటు కోడలు చూసి చూడనట్లుగా వదిలేసింది. కానీ అత్తమామల వేధింపులతో మొదటికే మోసం వస్తుందని మాత్రం ఆ కోడలు ఊహించలేకపోయింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలు ఈ క్రైమ్ స్టోరీలో ఏం జరిగిందనే పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
అది రాజస్థాన్ రాష్ట్రం బర్మార్ జిల్లా కాగోవు గ్రామం. ఇక్కడే తగారం (25) టప్పు దేవి (23) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గత కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల వైవాహిక జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. అలా సంతోషంగా సాగుతున్న దంపతుల జీవితంలోకి అత్తమామల ఎంటరయ్యారు. ఇంతటితో ఆగకుండా కోడలిని వేధించడం మొదలు పెట్టారు. మరీ ముఖ్యంగా అదనపు కట్నం తేవాలంటూ అత్తమామలు కోడలిని అనేక వేధింపులకు గురి చేశారు. మొదట్లో ఇదంతా మాములేనంటూ కోడలు టిప్పు దేవి చూసి చూడటనట్లుగా వదిలేసింది. కానీ రాను రాను అత్తమామల వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. దీంతో టిప్పు దేవి ఇదే విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియజేసింది.
విషయం తెలుసుకున్న టిప్పు దేవి తల్లిదండ్రులు వారి గ్రామంలో పెద్దలతో పంచాయితి పెట్టించి సర్దిచెప్పారు. అయినా టిప్పు దేవి అత్తమామల ప్రవర్తనలో మార్పు రాకపోగా.. అదనపు కట్నం వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఇక ఏం చేయాలో అర్థం కాని టిప్పు దేవి ఇటీవల స్థానికంగా ఉండే ఓ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. భార్య చనిపోయిన విషయం తెలుసుకున్న భర్త తగారం భార్య లేని బతుకు నాకు వద్దు అనుకుని.. తాను కూడా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషయం చివరికి పోలీసుల వరకు వెళ్లడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.