ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలు భార్యాభర్తల సంసారంలో చిచ్చురేపుతున్నాయి. ఇంకొందరైతే వావివరసలు మరిచి బరితెగించి ప్రవర్తిస్తున్నారు. ఈ వివాహేతర సంబంధాల కారణంగా హత్యలు చేయడం లేదంటే ఆత్మహత్యలు చేసుకోవడం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఓ అల్లుడు తన సొంత అత్తతో కలిసి లేచిపోయాడు. ఈ ఘటనతో అతని కుటుంబ సభ్యులు ఒక్కసారిగి షాక్ కు గురయ్యారు. అనంతరం ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది రాజస్థాన్ సిరోహి జిల్లా సియాకర గ్రామం. ఇక్కడే రమేష్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఇతనికి ముగ్గురు కూతుళ్లు జన్మించారు. అయితే తన పెద్ద కూతురు కిస్నాని అనే అమ్మాయిని నారాయణ్ జోగి అనే వ్యక్తికి ఇచ్చి గతంలో వివాహం జరిపించాడు. ఇక పెళ్లైన కొంత కాలం పాటు నారాయణ్ జోగి భార్యతో బాగానే కాపురం చేశాడు. ఎలాంటి గొడవలు లేకుండా దంపతులు దాంపత్య జీవితాన్ని కొనసాగించారు. అయితే అప్పుడప్పుడు నారాయణ్ జోగి అత్తింటికి వస్తూ వెళ్తుండేవాడు. అలా వస్తూ పోతూ ఉన్న సమయంలో నారాయణ్ జోగి అత్తపైనే మోజుపడ్డాడు. అత్త కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అతనితో కలిసి తెగ ఎంజాయ్ చేసింది. ఇలా అత్తాఅల్లుళ్ల ప్రేమా వ్యవహారం ఎవరికి తెలియకుండా ఘనంగా ముందుకు సాగింది. ఇక సమయం దొరికినప్పుడల్లా అత్త అల్లుడితో కలుస్తూ తెగ ఎంజాయ్ చేస్తూ వచ్చింది.
ఇదిలా ఉంటే ఇటీవల రమేష్ తన కూతురు, అల్లుడికి ఫోన్ చేసి తన ఇంటికి రమ్మన్నాడు. దీంతో కూతురు, అల్లుడు ఇద్దరూ వచ్చారు. దీంతో రమేష్ విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఆ రోజు రాత్రి అందరూ తిని పడుకున్నారు. కట్ చేస్తే అందరూ నిద్రలోకి జారుకున్నాక.. అత్త అల్లుడితో కలిసి లేచిపోయింది. ఇక తెల్లవారుజామున అల్లుడు తన భార్య కనిపించకపోవడంతో రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న వారి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.