పటాన్ చెరులో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ భర్త పనికి వెళ్లిన టైమ్ చూసుకుని సంచలన నిర్ణయం తీసుకుంది. భార్య అలా చేయడంతో భర్త తట్టుకోలేకపోయాడు.
దివ్య, వికాస్ భార్యాభర్తలు. వీరికి గతంలో వివాహం జరిగింది. ఇక బతుకు దెరువు కోసం చాలా కాలంగా హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్నారు. అయితే, భర్త నగరంలోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దీంతో భార్య ఇంట్లో ఒంటరిగా ఉంది. కట్ చేస్తే.. ఓ రోజు ఆ మహిళ ఉన్నట్టుండి భర్తకు ఫోన్ చేసింది. అర్జెంట్ గా ఇంటికి రావాలంటూ కబురు పంపింది. ఇది విన్న ఆమె భర్త.. వెంటనే హుటాహుటిన ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో భార్యను అలా చూసి ఆమె భర్త షాక్ గురయ్యాడు.
పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన వికాస్-దివ్య భార్యాభర్తలు బతుకు దెరువు కోసం గతంలో హైదరాబాద్ కు వచ్చారు. పటాన్ చెరు లోని ఇస్నాపూర్ లో నివాసం ఉంటున్నారు. భర్త స్థానికంగా ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ సంసారాన్ని కొనసాగిస్తున్నాడు. ఇక వికాస్ ఎప్పటిలాగే ఈ నెల 25న ఉద్యోగానికి వెళ్లాడు. ఇంట్లో భార్య దివ్య ఒంటరిగా ఉంది. ఏం జరిగిందో ఏం తెలియదు కానీ, అదే రోజు మధ్యాహ్నం దివ్య రూమ్ లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే భర్తకు ఫోన్ చేసి అర్జెంట్ ఇంటికి రావాలంటూ కబురు పంపింది. ఇది విన్న భర్త హుటాహుటిన ఇంటికి చేరుకున్నాడు.
భార్యను అలా చూసి వికాస్ తట్టుకోలేకపోయాడు. స్థానికుల సాయంతో భర్త దివ్యను ఆస్పత్రికి తరలించాడు. ఇక చికిత్స పొందుతూ దివ్య ఆదివారం ఆస్పత్రిలోనే ప్రాణాలు కోల్పోయింది. భార్య మరణించడంతో భర్త వికాస్ గుండెలు పగిలేలా ఏడ్చాడు. పోలీసులు స్పందించి దివ్య మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వివాహిత మరణంపై ఆమె తల్లి స్పందించి కన్నీరు మున్నీరుగా విలపించింది. అనంతరం మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆరోగ్యం బాగలేని కారణంగానే మా కూతురు బలవన్మరణానికి పాల్పడిందని ఫిర్యాదులో తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.