క్షణికావేశంలో కొందరు దేనికైన తెగిస్తున్నారు. చిన్నపాటి విషయాలకే ఆత్మహత్యలు చేసుకోవడం లేదంటే హత్యలు చేయడం వంటివి చేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే మరొకటి ఓడిశా రాష్ట్రంలో చోటు చేసుకుంది. అన్నంలో చీమలు వచ్చాయని అడిగినందుకు ఓ భార్య కట్టుకున్న భర్తను కనికరం లేకుండా దారుణంగా హత్య చేసింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు ఈ ఘటన వెనుక ఏం జరిగిందనే పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
సుందర్ గఢ్ జిల్లాలోని ఓ ప్రాంతంలో హేమంత్ బాఘ్ (35), సరిత (30) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరగగా.. ఇద్దరు కూతుళ్లు జన్మించారు. అయితే భర్త హేమంత్ బాఘ్ స్థానికంగా ట్రక్కు డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇక ఉన్నదాంట్లోనే సర్దుకుపోతూ ఈ దంపతులు సంతోషంగానే కాపురాన్ని నెట్టుకొస్తున్నారు. ఇంతవరకు ఈ దంపతుల సంసారం బాగానే సాగుతూ వస్తుంది. కాగా ఈ క్రమంలోనే ఈ దంపతులు ఇటీవల రాత్రిపూట తినేందుకు అందరూ ఇంట్లో కూర్చుకున్నారు. అయితే భర్త అన్నం వేసుకుని తింటుండగా.. అన్నంలో చీమలు కనిపించాయి. అవి చూసి భర్త ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు.
కోపంతో ఊగిపోయిన భర్త.. ఏంటి.. తినే అన్నంలో చీమలు వచ్చాయి.. అంటూ భార్య సరితను అడిగాడు. భర్త ఇలా అడగడంతో భార్య కోపంతో నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది. ఇక ఇదే విషయంపై దంపతుల మధ్య కాసేపు గొడవ జరిగడంతో ఒకరిపై ఒకరు తిట్టుకున్నారు. దీంతోs వీరి గొడవ తీవ్ర దాల్చడంతో భార్య భర్తపై కోపంతో ఊగిపోయింది. కోపంలో ఏం చేయాలో అర్థం కానీ భార్య సరిత క్షణికావేశంలో భర్త గొంతు నులిమి హత్య చేసింది. ఈ దాడిలో భర్త అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. హమంత్ మరణించడంతో తండ్రి తట్టుకోలేక కంటతడి పెట్టాడు. అనంతరం హేమంత్ తండ్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.