మద్యం మత్తు మనిషిని ఎంతటి దారుణాలకైనా తెగించేలా చేస్తుంది. దీని కారణంగా చిద్రమైన జీవితాలు కూడా ఎన్నో అని చెప్పక తప్పదు. ఇలాగే మద్యానికి బానిసైన ఓ భర్త ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. కట్టుకున్న భార్యపై తన ప్రతాపాన్ని చూపిస్తూ చివరికి పిల్లలను తల్లి లేని అనాధలుగా మార్చాడు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది నిజామాబాద్ జిల్లా బోదన్. ఇదే ప్రాంతంలో లక్షణ్, స్వప్న అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది.
పెళ్లైన కొంత కాలానికి వీరికి ముగ్గురు పిల్లలు కూడా జన్మించారు. అయితే ఉపాధి నిమిత్తం ఈ దంపతులు కొన్నాళ్ల నుంచి ఆర్మూరులో కాపురం పెట్టారు. భర్త తాపీ మేస్త్రీగా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కానీ రోజులు గడిచేకొద్ది లక్ష్మణ్ మద్యానికి బానిసై భార్యను వేధించడం మొదలు పెట్టాడు. ఇక ఈ క్రమంలోనే స్వప్న తల్లి అనారోగ్య పాలవ్వడంతో తరుచు పుట్టింటికి వెళ్లి వస్తుండేది. భార్య తనతో గడపకుండా పుట్టింటికి వెళ్లడాన్ని భర్త సహించలేకపోయాడు. దీని కారణంగా కూడా భార్యాభర్తల మధ్య గొడవలు చెలరేగాయి. అయితే భార్యపై కోపం పెంచుకున్న భర్త లక్ష్మణ్ ఇటీవల తాను అద్దెకు ఉంటున్న ఇంటికి పిల్లలతో పాటు భార్యను కూడా తీసుకెళ్లాడు.
అనంతరం అక్కడికి వెళ్లాక తన కుమారుల ముందే భార్య మెడకు చున్నీ చుట్టి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత తన పెద్ద కుమారుడిని అక్కడే ఉంచి ఇద్దరు పిల్లలను వెంటపెట్టుకుని పరారయ్యాడు. పెద్ద కుమారుడు స్థానికులకు జరిగింది మొత్తాన్ని పూస గుచ్చినట్లు వివరించాడు. ఇక స్వప్న కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం పోలీసులు భర్త లక్ష్మణ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.