నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చెడలవాట్లకు బానిసైన భర్తను చక్కదిద్దుదామని భావించిన భార్యకు నిరాశే ఎదురైంది. ఇదే విషయంపై భర్తను నిలదీసిన ఓ భార్యను భర్త దారుణంగా హత్య చేసిన ఘటన భీమ్ గల్ పట్టణంలో చోటు చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. జిల్లాలోని భీమ్‌గల్ మండలం పురాణీపేట్‌కు చెందిన తెడ్ల నగేశ్, లావణ్య ఇద్దరు భార్యాభర్తలు.
గతంలో వీరికి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లల సంతానం. అయితే భర్త స్థానికంగా కులవృత్తి అయిన వడ్రంగి పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కాగా కొంత కాలం వీరి కాపురం సంతోషంగానే సాగింది. అయితే రోజులు మారే కొద్ది భర్త మద్యానికి బానిసై చెడు తిరుగుల్లు తిరుగుతున్నాడు. చెడు వ్యసనాలకు బలైన భర్త భార్యాపిల్లలను వేధించడం మొదలు పెట్టాడు. అయితే ఇదే విషయమై భార్యాభర్తల మధ్య అనేక సార్లు గొడవలు కూడా చెలరేగాయి. ఇటీవల శనివారం కూడా నగేష్ మద్యం తాగొచ్చాడు. మద్యం తాగడం మానేయలని భార్య భర్తకు సూచించింది.
ఇది కూడా చదవండి: ఆస్పత్రిలో డీజే పాటలకు సిబ్బంది స్టెప్పులు.. వైద్యం అందక తల్లి కడుపులోనే శిశువు మృతి!