పైన ఫొటోలో కనిపిస్తున్న యువతి పేరు షేక్ దొరసానమ్మ. నెల్లూరు జిల్లాలోని ఓ గ్రామ సచివాలయ ఉద్యోగిగా సేవలు అందించారు. కానీ, ఉన్నట్టుండి ఈ యువతి ఇలా చేయడంతో తల్లిదండ్రులు నమ్మలేకపోయారు
నెల్లూరు జిల్లాకు చెందిన ఈ యువతి పేరు దొరసానమ్మ. వయసు 24 ఏళ్లు. కొంత వరకు చదువుకుని ప్రస్తుతం సచివాలయ ఉద్యోగిగా విధులు నిర్వస్తున్నారు. ఇక గురువారం బక్రీద్ పండగ సెలవు కావడంతో ఇంటి వద్దే ఉంది. అయితే, మధ్యాహ్న సమయంలో ఆమె బంధువులు ఇంటికి వచ్చారు. దొరసానమ్మ ఇంట్లోనే ఉందని గుర్తించారు. ఇక తలుపులు తీసి చూడగా.. ఆ యువతి వారికి ఊహించని స్థితిలో కనిపించింది. దొరసానమ్మను అలా చూసి వాళ్లు షాక్ గురయ్యారు. అసలు ఈ ఘటనలో ఏం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. నెల్లూరు జిల్లా దుత్తలూరు పరిధిలోని నందిపాడు. ఇదే గ్రామానికి చెందిన షేక్ దొరసానమ్మ (24) మర్రిపాడు మండలం పోలిరెడ్డిపల్లి సచివాలయ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, గురువారం బక్రీద్ పండగ సెలవు కావడంతో ఇంట్లోనే ఉంది. ఇక మధ్యాహ్న సమయంలో దొరసానమ్మ బంధువులు ఆమె ఇంటికి వచ్చారు. ఆ యువతి ఇంట్లోనే ఉన్నట్లుగా గమనించారు. తలుపులు తీసే ప్రయత్నం చేశారు. తలుపులను ఎంత తట్టినా స్పందనలేకపోవడంతో బద్దలు కొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా.. దొరసానమ్మ ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది.
ఈ సీన్ చూసిన ఆమె బంధువులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఇదే విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేశారు. హుటాహుటిన ఇంటికొచ్చి కూతురుని అలా చూసి ఆమె తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దొరసానమ్మ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.