పైన ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు పద్మ. వయసు 38 ఏళ్లు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన వట్టికోట శ్రీనివాస్ అనే వ్యక్తిని గతంలో వివాహం చేసుకుంది. భర్త శ్రీనివాస్ లారీ డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అలా పెళ్లైన కొంతకాలం పాటు ఈ దంపతులు బాగానే సంసారం చేశారు. ఇక కొన్నేళ్ల తర్వాత ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు జన్మించారు. పుట్టిన పిల్లలతో సంతోషంగా ఉంటున్న ఈ దంపతులు ఎలాంటి గొడవలు లేకుండా కాపురాన్ని ఈడ్చుకుంటూ వచ్చారు. అలా వీరి కాపురం చాలా ఏళ్ల వరకు సంతోషంగానే సాగింది.
కానీ ఈ మధ్యకాలంలో వీరి సంసారంలో ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చాయి. దీంతో ఇదే విషయమై భార్యాభర్తల మధ్య తరుచు గొడవలు జరిగాయి. దీంతో దంపతులు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఇన్నాళ్లు సంతోషంగా మెలిగి ఒక్కసారిగా గొడవలు జరగడంతో పద్మ తీవ్ర మనస్థాపానికి లోనైంది. కుటుంబ పరువు బజారును పడింది అనుకుందో ఏమనుకుందో ఏమో కానీ.. ఊహిాాంచని నిర్ణయం తీసుకుంది. తాజాగా భర్త విధులకు వెళ్లాడు. ఇదే మంచి సమయం అనుకున్న పద్మ సంచలన నిర్ణయం తీసుకుంది.
ఇలాంటి బతుకు నాకు వద్దు అనుకుని పద్మ ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఇక సాయంత్రం భర్త ఇంటికి వచ్చి చూడగా భార్య ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. ఈ సీన్ చూసిన భర్త ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. తల్లిని ఇలా చూసి పిల్లలు కంటకన్నీరు ఆగలేదు. ఈ విషయం తెలుసుకున్న పద్మ తల్లిదండ్రులు సైతం కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం ఈ ఘటనపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.