పైన ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు కృష్ణవేణి. కొంత వరకు చదువుకున్న ఈ మహిళ.. గత కొంత కాలం నుంచి ఓ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనికి కుదిరింది. అయితే ఇటీవల ఇంటికి వెళ్తున్నానని చెప్పి..!
ఆమె పేరు కృష్ణవేణి. వయసు 22 ఏళ్లు. నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన ఈ మహిళ స్థానికంగా ఉండే ఓ ప్రాంతంలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనికి కుదిరింది. ఆ మహిళ ఇక్కడే చాలా రోజుల పాటు పని చేస్తూ ఓ హాస్టల్ ఉంటూ ఉండేది. అయితే అంతా బాగానే ఉన్నా.. ఇటీవల ఇంటికి వెళ్తున్నానని కృష్ణవేణి హాస్టల్ చెప్పి వెళ్లింది. కట్ చేస్తే ఊహించిన పరిణామం చోటు చేసుకుంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలేం జరిగిందంటే?
నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోని మరికల్. ఇదే ప్రాంతంలో కృష్ణవేణి (22) అనే మహిళ నివాసం ఉండేది. కొంత వరకు చదువుకున్న ఈ మహిళ గత కొంత కాలం నుంచి మేడిపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి ల్యాబ్ టెక్నీషియన్ గా పనికి కుదిరింది. దీంతో ఆ యువతి అప్పటి నుంచి స్థానికంగా ఓ హాస్టల్ లో ఉంటూ ఉద్యోగానికి వెళ్లేది. అలా కొన్ని రోజుల పాటు ఆ మహిళ అక్కడే పని చేస్తూ వచ్చింది. ఇదిలా ఉంటే ఈ నెల 5న ఇంటికి వెళ్తున్నానని కృష్ణవేణి హాస్టల్ లో చెప్పి వెళ్లింది. అదే రోజు సాయంత్రం అయింది. కానీ, కృష్ణవేణి మాత్రం ఇంటికి చేరుకోలేదు.
దీంతో ఖంగారుపడ్డ కృష్ణవేణి కుటుంబ సభ్యులు కూతురికి ఫోన్ చేశారు. అయినా స్పందించలేదు. ఇక వారికి ఏం చేయాలో అర్థంకాక చుట్టు పక్కల ప్రాంతాల్లో అంతటా వెతికారు. ఆమె ఆచూకి మాత్రం దొరకలేదు. ఇక చేసేదేం లేక ఆ మహిళ కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ మహిళ ఆచూకి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఉన్నట్టుండి కృష్ణవేణి కనిపించకుండాపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.