వాళ్లిద్దరూ భార్యాభర్తలు. బాగా చదుకువుని మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ దంపతులు ఎలాంటి మనస్పర్థలు, గొడవలు లేకుండా సంతోషంగా జీవించారు. ఇక అంతా బాగానే ఉందనుకునే తరుణంలోనే ఈ దంపతులు షిర్డీ సాయిని దర్శించుకునేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే వీరు చేసిన ఓ చిన్న తప్పు వల్ల జరగరాని ఘోరం జరిగిపోయిది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ దంపతులు చేసిన తప్పేంటి? అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పశ్చిమ భాండూప్ టెంభిపాడ తానాజీవాడ చాల్ ప్రాంతానిక చెందిన మనోజ్ జోషి(36), మాన్సీ జోషి (34) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గత కొన్నేళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. ఇక భార్యాభర్తలిద్దరూ మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ సంతోషంగానే ఉన్నారు. అయితే ఈ సమయంలోనే మనోజ్ జోషి, మాన్సీ జోషి దంపతులు మరికొంతమంది కలిసి కొత్త సంవత్సరం నాడు షిర్డీ సాయిని దర్శించుకునేందుకు వెళ్లారు. కొంతమంది మినీ బస్సులో వెళ్లగా మనోజ్ జోషి, మాన్సీ జోషి దంపతులు మాత్రం కూతురుతో పాటు బైక్ పై వెళ్లారు. ఇదే వీరు చేసిన తప్పు.
వీరు భివండీ పరిధిలతోని యెవైనానా వద్దకు చేరుకోగానే వీరు ప్రయాణిస్తున్న బైక్ ను వెనకాల నుంచి బలంగా ఓ భారీ కంటైనర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మనోజ్ జోషి, మాన్సీ జోషి దంపతులు అక్కడిక్కడే రక్తపు మడుగులో పడి పోయారు. వెంటనే స్పందించిన మరికొంతమంది వారిని ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోవడంతో వారు అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. వీరి కూతురు మాత్రం తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనపై స్పందించిన స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు చనిపోవడంతో కూతురు ఎవరూ లేని అనాధలా మారి ఏడుస్తూ ఉంది. ఈ దృశ్యం పలువురిని కలిచి వేసింది. తాజాగా వెలుగు చూసిన ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.