నేటి కాలం యువత సమస్యలకు పరిష్కారం లేదన్నట్లుగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రియుడు మోసం చేశాడని, తల్లిదండ్రులు మందలించారని, చదువులో రాణించలేకపోతున్నామంటూ చివరికి క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాగే ఓ 10వ తరగతి విద్యార్థిని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటనతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు.
డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట ప్రాంతానికి వెంకటేశ్వర్లు, శిరీష దంపతులు. ఈ భార్యాభర్తలు మియాపూర్ లో నివాసం ఉంటున్నారు. భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, భార్య ప్రభుత్వ టీచర్ గా పని చేస్తుంది. వీరికి కొడుకు మోహిత్, కూతురు సంజన (14) సంతానం. అయితే సంజన పటాన్ చెరులోని ఓ ప్రైవేట్ స్కూల్ లో 10వ తరగతి చదువుతుంది. అయితే సంజన రోజూ స్కూల్ కు వెళ్తూ వస్తుండేది. ఇక ఎప్పటిలాగే శనివారం కూడా సంజన స్కూల్ కు వెళ్లి సాయంత్రం ఇంటి చేరుకుంది. ఇకపోతే ఈ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ఇదే మంచి సమయం అనుకున్న సంజన.. ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఇక సాయంత్రం తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూడగా.. కూతురు సంజన ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. ఈ సీన్ చూసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. కూతురిని ఆ స్థితిలో చూసిన తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. అనంతరం ఆ దంపతులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ బాలిక మృతదేహాన్ని పరిశీలించారు. ఆ తర్వాత మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఆ బాలిక చదువు ఒత్తిడి కారణంగానే బలవన్మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తుంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. చదువు ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడిన సంజన నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.