హైదరాబాద్ నగరంలో ఆడవారిపై అకృత్యాలు, దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొన్ని సంఘటనలు ప్రేమ, పెళ్లి గురించి జరుగుతుంటే మరికొన్ని మగవారి కామ వాంఛల కోసం జరుగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం ఓ స్కూల్లో కొంతమంది బాలురు తమతో పాటు చదివే బాలికపై లైంగిక దాడి చేశారు. ఆ ఘటన మరువకముందే మరో ఘటన చోటుచేసుకుంది. విద్యా బుద్ధులు నేర్పాల్సిన గురువే బాలికతో తప్పుగా ప్రవర్తించాడు. ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఇవన్నీ ఒక ఎత్తయితే, ఇప్పుడు చోటుచేసుకున్న ఘటన మరో ఎత్తు.. ఓ యువకుడు ప్రియురాలిపై కత్తితో దాడి చేశాడు. అంతటితో ఆగకుండా అడ్డొచ్చిన ఆమె తల్లిపై కూడా దాడి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నగరానికి చెందిన సందీప్ అనే వ్యక్తి మియాపూర్‌కు చెందిన ఓ యువతి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. గొడవల కారణంగా గత కొంతకాలంనుంచి ఇద్దరూ దూరంగా ఉంటున్నారు.
మంగళవారం సందీప్ మియాపూర్‌లోని ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆమెతో గొడవపెట్టుకున్నాడు. అనంతరం వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను పొడిచాడు. ఈ దృశ్యాన్ని చూసిన యువతి తల్లి షాక్ తింది. వెంటనే అతడ్ని ఆపే ప్రయత్నం చేసింది. దీంతో సందీప్ ఆమెపై కూడా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ వారు అక్కడే పడిపోయారు. సందీప్ అక్కడినుంచి పరారయ్యాడు యువతి, ఆమె తల్లి అరుపులు విన్న పొరగిల్ల వారు అక్కడికి చేరుకున్నారు. గాయాలపాలైన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న సందీప్ కోసం అన్వేషిస్తున్నారు. మరి, ప్రేమ పేరుతో ప్రియురాలిపై, ఆమె తల్లిపై దాడికి పాల్పడ్డ సందీప్ ఉదంతం పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.