జీవితాంతం నీకు తోడుగా ఉంటానని భార్య మాటిచ్చింది. దీంతో మురిసిపోయిన భర్త.. భార్యకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకున్నాడు. కానీ, చివరికి భార్య మాత్రం తాళికట్టిన భర్తను మోసం చేసి, ఊహించిన దారుణానికి పాల్పడింది. అసలేం జరిగిందంటే?
భార్యాభర్తల బంధం ఎంత గొప్పదో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి బంధంపై కొందరు పెళ్లైన మహిళలు తప్పుడు పనులు చేస్తూ చివరికి ఆ బంధానికి ఉన్న విలువనున తీసేస్తున్నారు. అయితే కట్టుకున్న వాడిని కాదని మరొకడితో చీకటి కాపురం చేస్తూ.. చివరికి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అచ్చం అలాగే భావించిన ఆ మహిళ ఊహించని దారుణానికి పాల్పడింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందంటే?
మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలం ఔషపూర్ గ్రామం. ఇక్కడే మౌలన్-శాంతి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే పెళ్లి జరిగింది. అయితే పెళ్లైన కొంత కాలం పాటు ఎలాంటి గొడవలు లేకుండా సంసారాన్ని ఈడ్చుకొచ్చారు. మౌలన్ కూడా భార్యకు ఎలాంటి కష్టం రాకుండా సంతోషంగా చూసుకున్నాడు. కానీ, భార్య శాంతి మాత్రం హద్దులు దాటి చెడు మార్గాల వైపు అడుగులు వేసింది. విషయం ఏంటంటే? శాంతి.. భర్తను కాదని స్థానికంగా ఉండే బాబు అనే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది.
అలా శాంతి తన చీకటి కాపురం భర్తకు తెలియకుండా కొన్నేళ్ల పాటు కొనసాగించింది. ఇదే విషయం ఇటీవల భర్త మౌలన్ కు తెలిసింది. దీంతో తట్టుకోలేకపోయిన భర్త.. భార్యను మందలించాడు. ఇదే భార్య శాంతికి నచ్చలేదు. ఇలా అయితే కాదని, ఎలాగైనా సరే భర్తను ప్రాణాలతో లేకుండా చేసి ఎంచక్కా ప్రియుడితో ఉండాలనుకుంది. దీనికి కోసం శాంతి పక్కా ప్లాన్ గీసింది. మౌలన్ హత్యలో భాగంగా శాంతి, ప్రియుడు బాబు ఇద్దరూ కలిసి మౌలన్ తాగే మద్యంలో విషం కలిపారు. అది తాగిన భర్త చనిపోయాడు. ఆ తర్వాత ఈ విషయం ఎవరికీ తెలియకుండా మరుసటి రోజు.. నా భర్త రాత్రి కడుపు నొప్పితో చనిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నపోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత మౌలన్ మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే పోస్ట్ మార్టం రిపోర్టులో మాత్రం.. విషం కలిపిన మద్యం తాగడం వల్లే మౌలన్ చనిపోయాడని వైద్యులు రిపోర్ట్ లో తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు భార్యను విచారించగా సంచలన నిజాలు బయటపెట్టింది. నా ప్రియుడితో పడక సుఖానికి అడ్డొస్తున్నాడని, దీని కారణంగానే ప్రియుడితో కలిసి హత్య చేశానని భార్య శాంతి తెలిపింది. అనంతరం పోలీసులు నిందితులైన శాంతి, బాబులను అరెస్ట్ చేశారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.