మెదక్ జిల్లాలో ఓ వ్యక్తిని సొంత బావమరిది దారుణంగా హత్య చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. సొంత బావను బావమరిది ఎందుకు హత్య చేశాడో తెలుసా?
మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. సొంత బావమరిది బావకు ఫుల్ గా మద్యం తాగించాడు. అతడు పూర్తిగా మత్తులోకి జారుకున్నాక బావను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. సొంత బావను బావమరిది ఎందుకు హత్య చేశాడు? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? అసలేం జరిగిందంటే? పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని గాంధీనగర్ లో దర్జీ శ్రీనివాస్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి సంతోష్ అనే బావమరిది ఉన్నాడు. అయితే ఈ ఇద్దరి మధ్య గత కొంత కాలంగా ఆస్తి గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇదే విషయమై సంతోష్, శ్రీనివాస్ ఇటీవల మరోసారి గొడవ పడినట్లుగా సమాచారం. ఇదే కోపంతో సంతోష్ బావ శ్రీనివాస్ ను హత్య చేయాలని అనుకున్నాడు.
ఇందులో భాగంగానే గురువారం సంతోష్ బావ శ్రీనివాస్ కు ఫోన్ చేశాడు. కలవాలనే చెప్పి ఇద్దరూ పెద్ద బజార్ లో కలుసుకున్నారు. అక్కడికి వెళ్లాక ఓ షాపులో ఇద్దరూ మద్యం సేవించారు. శ్రీనివాస్ మద్యం మత్తులోకి జారుకున్నాడు. ఇదే మంచి సమయం అనుకున్న సంతోష్.. తన సొంతబావ శ్రీనివాస్ దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత అతడి శవాన్ని అక్కడే వదిలేసి అక్కడి నుంచి పరారయ్యాడు. అప్పటి నుంచి అతడు కనిపించకపోవడంతో శ్రీనివాస్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ క్రమంలోనే పెద్ద బజార్ లో శ్రీనివాస్ శవం ఉందని పోలీసులకు సమాచారం అందింది.
హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక పోలీసుల దర్యాప్తులో మృతుడు శ్రీనివాసును బావమరిది సంతోషే హత్య చేసినట్లు తెలింది. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సంతోష్ ను అరెస్ట్ చేశారు. తండ్రి ఆస్తికి బావ అడ్డొస్తున్నాడని, అందుకే హత్య చేశానని నిందితుడు అంగీకరించినట్లుగా పోలీసులు తెలిపారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. తండ్రి ఆస్తికి బావ అడ్డొస్తున్నాడని సొంత బావను హత్య చేసిన బావమరిది దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.