చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అందుకున్న కన్నడ ముూవీ ‘కాంతార’. మొదట కన్నడలో విడుదలై మంచి టాక్ సొంతం చోసుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఇండస్ట్రీలో భారీ కలెక్షన్లు వసూలు చేసింది. కన్నడలో వచ్చిన టాక్ తో అక్టోబర్ 15 తెలుగుతో పాటు పలు భాషల్లో కాంతార మూవీ విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపిస్తోంది. సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ ఎంతో అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో సినిమాను చూసేందుకు ప్రేక్షకులు భారీగా తరలి వెళ్తోన్నారు. ఇది ఇలా ఉంటే.. తాజాగా ఈ సినిమా చూస్తూ ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే..
కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కాంతార’. చిన్న సినిమాగా వచ్చి సూపర్ డూపర్ హిట్ సొంతం చేసుకుంది. కన్నడ విడుదలై నెలలు గడుస్తోన్న సినిమా చూస్తేందుకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. ఇక కాంతార చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ‘గీతా ఆర్ట్స్’ రిలీజ్ చేసింది. రిలీజైన మొదటి రోజే ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. విమర్శకులు అయితే ఈ మూవీని ఓ రేంజ్ లో పొగుడుతూ రేటింగ్ లు ఇచ్చారు. మొదటి రోజు మార్నింగ్ షోలు మ్యాట్నీలు కాస్త డల్ గా కనిపించిన సాయంత్రం షోల నుండి ఈ మూవీ బాగా వ కలెక్ట్ చేస్తూ దూసుకుపోతోంది. ఇది ఇలా ఉంటే కర్ణాటక రాష్ట్రం మాండ్య జిల్లా నాగమంగళలోని వెంకటేశ్వర థియేటర్ వద్ద ఓ విషాద ఘటన చోటు చేసుకుంది.
నాగమంగళ తాలూకాలోని సరిమేగలకొప్ప గ్రామానికి చెందిన రాజశేఖర్ అనే 45 ఏళ్ల వ్యక్తి ‘కాంతార’ సినిమా చూసేందుకు వెంకటేష్ థియేటరకు వెళ్లాడు. ఇక సినిమా చూస్తూ తెగ ఎంజాయ్ చేశాడు. అయితే మధ్యలో సినిమా చూస్తుండగా అతడికి ఛాతీలో నొప్పి వచ్చింది. ఇక ఒక్కసారిగా కూర్చిలో నుంచి కిందకు కుప్పకూలిపోయాడు. ఈ క్రమంలో గుండె పోటుతో ఆ వ్యక్తి మరణించినట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనతో మృతి కుటుంబంలో విషాదం అలుముంకుంది. సినిమా చూడటానికి వెళ్తున్న అని చెప్పి.. ఎంతో సంతోషంగా వెళ్లాడని, ఇప్పుడు సినిమా నుంచి విగత జీవిగా రావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడికి పెళ్లై భార్య, పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఇలా సినిమాలకు వెళ్లి.. గుండె పోటుతో మరణించిన ఘటనలు గతంలోనూ అనేకం జరిగాయి. అయితే వ్యక్తిగత ఆరోగ్య సమస్యలతోనే ఇలా జరుగుతుంటాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.