నేటి సమాజం పరిస్థితుల పట్ల ప్రభుత్వాలు నిర్భయలాంటి కఠినమైన చట్టాలు తెచ్చినా కామాంధుల తీరు మాత్రం అస్సలు మారటం లేదు. వావి వరసలు మరిచి ఏకంగా పసిపిల్లలపై అత్యాచారాలకు కాలు దువ్వుతున్నారు కసాయి మృగాళ్లు. తాజాగా ఇలాంటి దారుణమైన ఘటనే ఖమ్మం నడి ఒడ్డున చోటు చేసుకుంది. జిల్లాలోని నేలకొండపల్లి మండలం మోటాపురం గ్రామ పరిధిలోని పెద్ద తండాలో ఈ ఘటన జరిగింది. దీప్లా నాయక్ అనే 60 ఏళ్ల వ్యక్తి ఎదురుంటిలో ఉన్న ఆరేళ్ల పాపపై కన్నేశాడు.
రోజులాగే ఆ పాప తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లటం చూశాడు ఆ కసాయి దీప్లా నాయాక్. ఇంట్లో ఎవరూ లేరని గ్రహించి, ఆ ఒంటరి పాపను తన ఇంట్లోకి ఎత్తుకెళ్లాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ వ్యక్తి ఆ ఆరేళ్ల బాలికపై దారుణాతి దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇక ఆ బాలిక తల్లిదండ్రులు ఇంటికి చేరకుని పాప కనిపించటం లేదంటూ ఊరంత వెతికారు. అయినా ఆ పాప జాడ దొరకలేదు. తనతో పాటు ఆడుకునే పిల్లలను అడిగే సరిగి దీప్లా నాయక్ తాత ఇంట్లోకి తీసుకెళ్లాడని చెప్పారు. ఆ తల్లిదండ్రులు ఆ కామాంధుడి ఇంట్లోకి వెళ్లి చూసే సరికి తమ కూతురు వివస్త్రగా పడి ఉండటం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు.
దీంతో కన్నీరు మున్నీరుగా విలపించిన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక బాలికను వైద్య పరీక్షల కోసం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అభం శుభం తెలియని చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన దీప్లానాయక్‌ను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక దీప్లా నాయక్ లాంటి ఎందరో వ్యక్తులు చేస్తున్న ఇలాంటి ఘటనలపై వాళ్లకి ఎలాంటి శిక్ష వేయాలో కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.