ఈమె పేరు వనజాత. గత రెండు మూడు రోజుల నుంచి కనిపించకుండపోయింది. భార్య కనిపించకుండపోవడంతో భర్త, తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఈ మధ్యకాలంలో తెలంగాణలో మిస్సింగ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇటు 3 ఏళ్ల పిల్లల నుంచి అటు 40 ఏళ్ల మహిళల వరకు అదృశ్యమవుతున్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ జంట నగరాల్లో గతంలో పోలీసులు అనేక మిస్సింగ్ కేసులు నమోదు చేశారు. ఇక ఇటీవల బర్త్ డే పార్టీకి వెళ్లిన ముగ్గురు బాలకలు అదృశ్యమైన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన మరువకముందే తాజాగా మరో వివాహిత కనిపించకుండాపోయింది. ఉన్నట్టుండి ఆ మహిళ కనిపించకుండాపోవడంతో భర్త, ఆ మహిళ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అసలేం జరిగిందంటే?
తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని రాచాల గ్రామం. ఇక్కడే గంటెల పరుశురామ్-వనజాత (30) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గత కొన్నేళ్ల కిందటే వివాహం జరిగింది. అయితే ఉన్నట్టుండి భార్య వనజాత కనిపించకుండపోవడంతో భర్త ఖంగారుపడ్డాడు. అనంతరం స్థానిక ప్రాంతాల్లో గాలించాడు. అయినా భార్య ఆచూకి మాత్రం దొరకలేదు. దీంతో భర్తకు ఏం చేయాలో తెలియక వెంటనే భార్య తల్లిదండ్రులకు సమాచారం అందించాడు.
ఆ తర్వాత చేసేదేం లేక భర్త, అత్తమామలు స్థానిక పోలీసులు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎవరికైన వనజాత ఆచూకి కనిపిస్తే.. 8712659353 నెంబర్ కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. అయితే గత రెండు మూడు రోజుల నుంచి భార్య కనిపించకుండాపోవడంతో భర్త పరుశురామ్, ఆమె తల్లిదండ్రులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతుంది.