ఈ రోజుల్లో వివాహేతర సంబంధాల కారణంగా పచ్చని కాపురాలు నిట్టనిలువునా కూలిపోతున్నాయి. భర్తను కాదని భార్య, భార్యని కాదని భర్త.. ఇలా ఒకరిని కాదని మరొకరు తెర వెనుక సంసారానికి శ్రీకారం చుడుతూ చివరికి హత్యలు, ఆత్మహత్యలకు వరకు వెళ్తున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ యువకుడు ముగ్గురు పిల్లల తల్లితో ప్రేమాయణాన్ని కొనసాగించాడు. చివరికి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. కానీ ఆ మహిళ అతనితో పెళ్లికి నిరాకరించడంతో దారుణానికి ఒడిగట్టాడు. తాజాగా మహారాష్ట్రలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొల్హాపూర్ లోని షాహాజీనగర్ లో కవిత (34) అనే మహిళకు పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే కవిత భర్త గతంలోనే మరణించడంతో కుట్టు పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. అయితే మగతోడు లేక ఒంటరిగా జీవితాన్ని సాగదీస్తున్న కవితకు బంధువైన రాకేష్ శ్యామ్ రావ్ (30) అనే యువకుడు పరిచయమయ్యాడు. వీరిద్దరి పరిచయం రాను రాను వివాహేతర సంబంధానికి దారి తీసింది. అలా కొంత కాలం పాటు వీరి చీకటి కాపురం రంజుగా సాగుతూ వచ్చింది. ఇదిలా ఉంటే గత కొంత కాలం నుంచి రాకేష్ కవితను పెళ్లి చేసుకోవాలని వెంటపడుతూ ఉన్నాడు.
ముగ్గురు పిల్లలు ఉండడంతో ఆ మహిళ అతనితో పెళ్లికి నిరాకరిస్తూ వచ్చింది. కాగా రాకేష్ మరోసారి కవితను చేసుకోవాలంటూ కోరాడు. దీనికి కవిత మళ్లీ చేసుకోనంటూ నిరాకరించింది. ఇక పట్టలేని కోపంతో ఊగిపోయిన రాకేష్ ప్రియురాలు కవితను దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడు రాకేష్ ను అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రులు ఇద్దరు మరణించడంతో ఉన్న ముగ్గురు పిల్లలు అనాథలై కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పిల్లలు ఏడుస్తున్న సీన్ ను చూసి స్థానికుల కంట కన్నీరు ఆగడం లేదు. తాజాగా చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.