అతనికి గతంలో ఓ మహిళతో వివాహం జరిగింది. ఆమె చాలదు అన్నట్లు భార్యకు తెలియకుండా మరో మహిళను వివాహం చేసుకున్నాడు. దీంతో ఇద్దరి భార్యలతో అతడు సంసారం చేస్తూ వచ్చాడు. ఇక ఇంతటితో బుద్దిగా ఉండని ఈ కామాంధుడు స్థానిక అందమైన మహిళలపై మోజు పడ్డాడు. దీంతో వారితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ ఎంజాయ్ చేసేవాడు. ఇంతటితో ఆగక ప్రియురాలితో ఉండగా అలాంటి వీడియోలను తీసి మొదటి భార్యకు చూపిస్తూ వేధింపులకు పాల్పడ్డాడు. భర్త ఇన్ని చేసినా సైలెంట్ గా ఉన్న మొదటి భార్య తట్టుకోలేక చివరికి భర్తకు దిమ్మతిరిగే షాకిచ్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
హన్మకొండ జిల్లా కాజీపేటలోని డీజిల్ కాలనీలో వేణుకుమార్ (34) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. గతంలో ఇతను సుష్మిత అనే మహిళను వివాహం చేసుకున్నాడు. భర్త చిట్టీల వ్యాపారం చేస్తుండగా భార్య రైల్వేలో ఉద్యోగం చేస్తుంది. అలా పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. ఇక కొంత కాలం తర్వాత భర్త వేణుకుమార్ మొదటి భార్యకు నచ్చజెప్పి మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఇద్దరి భార్యల ముద్దుల మొగుడిలా మారిన విజయ్ కుమార్.. సంసారాన్ని అలా సాగిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే విజయ్ కుమార్ ఇంట్లో ఇద్దరు భార్యాలున్నా.. పరాయి మహిళలపై మోజుపడ్డాడు. స్థానికంగా ఉండే కొందరి మహిళలతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. సమయం దొరికినప్పుడల్లా భర్త ప్రియురాళ్లతో పడక సుఖాన్ని అనుభవిస్తూ ఆ సమయంలో వీడియోలు తీసుకునేవాడు.
అలా తీసుకున్న వీడియోలను తన మొదటి సుష్మితకు చూపించి వేధించేవాడు. కానీ.., రాను రాను.., భర్త వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఇక తట్టుకోలేని మొదటి భార్య సుష్మిత ఊహించని నిర్ణయం తీసుకుంది. ఎలాగైన భర్తను చంపాలని ప్లాన్ వేసి.. భూపాలపల్లికి చెందిన రత్నాకుమార్ తో ఒప్పందం కుదుర్చుకుంది. భర్త హత్యకు భార్య సుష్మిత సుపారీ కింద రూ.4 లక్షలతో రత్నకుమార్ తో డీల్ కుదుర్చుకుని ముందుగా రూ.2 లక్షలు ఇచ్చింది. ఇక భర్త హత్యలో భాగంగా సెప్టెంబర్ 30న భార్య భర్తకు పాయసంలో నిద్రమాత్రలు కలిపి తాగించింది. అనంతరం నిందితులు నిద్రలో ఉన్న విజయ్ కుమార్ ను కారులో ఎక్కించుకుని పెద్దపల్లి జిల్లా లోని మానేరు వాగు వద్దకు తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లాక విజయ్ కుమార్ గొంతు పిసికి హత్య చేసి శవాన్ని అందులో పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఇక మరుసటి రోజు భార్య సుష్మిత… నా భర్త కనిపించకుండాపోయాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
అయితే సుష్మిత పదే పదే పోలీస్ స్టేషన్ కు వచ్చి నా భర్త ఆచూకి తెలపాలంటూ అల్లరి చేసేది. ఈ క్రమంలోనే పోలీసులకు ఆ మహిళపై అనుమనం వచ్చింది. దీంతో ముందుగా ఆమె ఫోన్ కాల్ లీస్ట్ చెచ్ చేయగా ఆమె ముగ్గురు రౌడీలతో మాట్లాడినట్లు తేలింది. ఈ సమయంలోనే ఓ గుర్తు తెలియని శవం మానేరు వాగులో తేలింది. అతడిని పరిశీలించగా మిస్సైంది ఎవరో కాదు.., సుష్మిత భర్తేనని పోలీసులు తెలుసుకున్నారు. దీంతో భార్య సుష్మితను పోలీసులు గట్టిగా విచారించగా.. నేనే చంపానలంటూ ఒప్పుకుంది. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుష్మితతో పాటు మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.