పడక సుఖానికి అలవాటు పడ్డ కొందరు క్షణికావేశంలో ఎంతటి దారుణాలకైన పాల్పడుతున్నారు. ఇటీవల మహబూబ్‌నగర్ లో చోటు చేసుకున్న దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. అది మహబూబ్‌నగర్ జిల్లా తిరుమలగిరి ప్రాంతంలోని పెద్దబావి తండా. ఇదే ప్రాంతానికి చెందిన మాంజానాయక్ అనే వ్యక్తి బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చాడు. సెంట్రివర్ వర్క్ చేస్తూ బడంగ్‌పేటలోని శ్రీవిద్యానగర్ టౌన్షిప్ నివాసం ఉంటున్నాడు.
అలా పని చేస్తున్న క్రమంలో మీర్పేట్కి చెందిన అనురాధ అనే మహిళ ఇతనికి పరిచయమైంది. రాను రాను వీరిద్దరి పరిచయం చివరికి శారీరక కోరికలు తీర్చుకునే స్థాయికి చేరుకుంది. ఇళ్లలో పనిచేసుకునే అనురాధను క్షణిక సుఖం కోసం మాంజానాయక్ వెయ్యి రూపాయలు ఇస్తానని చెప్పి ఇంటికి తెచ్చుకున్నాడు. ఇక ఇద్దరూ కలిసి గంట గడిపిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం మాంజానాయక్ అనురాధకు వెయ్యి రూపాయలు ఇచ్చాడు. కాగా మాంజానాయక్ వాష్ రూమ్‌లోకి వెళ్లడం అనురాధ గమనించింది. ఇదే సరైన సమయమని భావించి అతని పర్సులో ఉన్న మరో ఐదు వేలరూపాయలు తీసుకొని పరారైంది.
ఇది కూడా చదవండి: Madhya Pradesh: ఏళ్లుగా ముగ్గురితో సహజీవనం.. కట్ చేస్తే ఇప్పుడు ఒకే వేదిక మీద పెళ్లి!
మాంజానాయక్ వాష్ రూమ్ నుంచి తిరిగి వచ్చే సరికి అనురాధ లేదు, పర్సులో ఐదు వేల రూపాయలు లేవు. దీంతో అనుమానమొచ్చి అనురాధను ఫాలో అయి బడంగ్‌పేటలో ఒక ప్లాట్ వద్ద పట్టుకున్నాడు. తన దగ్గర తీసుకున్న ఐదు వేల రూపాయలు ఇవ్వమని కోరాడు. అనురాధ ఇవ్వనని తెగేసి చెప్పింది. దీంతో కోపంతో ఊగిపోయిన మాంజానాయక్ ఆమె తలపై బండరాయిని బలంగా బాదాడు. ఈ దాడిలో అనురాధ అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి మరణించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.