బుద్ధిగా చదువుకుని ఉన్నతిలోకి రావాల్సిన యువకులు తప్పుదోవపడుతున్నారు. పనికమాలిన వారితో సావాసం చేసి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అల్లరి పేరుతో అమ్మాయిలపై వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా, మధురై నగరంలో కొంతమంది యువకులు హల్‌చల్ చేశారు. రోడ్డుపై పదుల సంఖ్యలో బైకులపై తిరుగుతూ అమ్మాయిలను ఇబ్బంది పెట్టారు. ప్రశ్నించిన అమ్మాయిల తల్లిదండ్రులపై దాడికి దిగారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడులోని మధురై, కోరిపాలయంకు చెందిన కొందరు యువకులు ఫుల్లుగా మందు తాగారు.
బైకులతో రోడ్డుపైకి వచ్చారు. స్పీడుగా బైకులు నడుపుతూ, గట్టిగా కేకలు వేస్తూ మధురై మీనాక్షి కాలేజ్ ఆవరణలోకి చేరుకున్నారు. అక్కడ రోడ్డుపై వెళుతున్న అమ్మాయిలను చూడగానే వారి పాడు బుద్ధి బయటపెట్టారు. వెంటనే బైకులపై అమ్మాయిలను ఫాలో అవుతూ వేధించటం మొదలుపెట్టారు. అసభ్యంగా తాకసాగారు. రోడ్డుపై అటు,ఇటు తిరుగుతూ వాళ్లను వేధింపులకు గురి చేశారు. కాలేజ్‌లోకి కూడా బైకులతో చొచ్చుకువెళ్లారు. అక్కడ కూడా భీభత్సం సృష్టించారు. తర్వాత అక్కడినుంచి బస్టాప్ దగ్గరకు వచ్చారు. అక్కడ కూడా ప్రయాణికులను, అమ్మాయిలను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు.
దీంతో ఓ విద్యార్ధిని తండ్రి దీనిపై వారిని ప్రశ్నించాడు. ఈ నేపథ్యంలోనే ఆ యువకులు ఆయనపైకి దాడికి దిగారు. ఓ కుర్రాడు హెల్మెట్‌తో పెద్దాయనపై దాడి చేశాడు. అనంతరం కిందపడేసి మరీ కొట్టారు. యువకుల క్రూర చేష్టలకు అక్కడివారంతా భయాందోళనలకు గురయ్యారు. కొంతమంది కాలేజ్‌కు గేటు వేసి లోపల దాక్కున్నారు. అయితే, ఈ ఘటనపై బాధిత వ్యక్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాదాపు ఆరుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Madurai violence against College girls & their parents is horrific.
Like we repeatedly say Mr.#MKStalin is the weakest ever Chief Minister Tamil Nadu has ever had.
Law & Order plummets because he neither inspires nor is vigilant against trouble makers.pic.twitter.com/LgRFAUXlxg
— SG Suryah (@SuryahSG) November 5, 2022