ఆమెకు తన కూతుళ్ల కంటే ప్రియుడంటేనే చచ్చేంత ఇష్టం. ప్రియుడిని దక్కించుకునేందుకు తన కూతుళ్లను పక్కనపెట్టాలని చూసింది. కానీ ప్రయత్నాలు ఎన్ని చేసినా విఫలమవుతూనే ఉన్నాయి. పైగా తన ప్రియుడితో పడక సుఖానికి కూతుళ్లు అడ్డుగా ఉండడంతో అడ్డుతొలగించాలని బలంగా అనుకుంది. దీంతో ప్రియుడితో చేతులు కలిపిన ఈ దుర్మార్గురాలు ఏం చేసిందో తెలిస్తే దిమ్మతిరుగుతుంది. ఇక స్టోరీలోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో ఓ 42 ఏళ్ల మహిళ 12, 14, 16 ఏళ్లు కలిగిన ముగ్గురు కూతుళ్లతో నివాసం ఉంటుంది.
కూతుళ్లతో తన సంసారాన్ని సాగిస్తున్న క్రమంలోనే ఈ ముగ్గురు పిల్లల తల్లి ఓ వ్యక్తితో పరిచయం పెంచుకుంది. ఈ పరిచయమే రాను రాను వివాహేతర సంబంధానికి దారి తీసింది. అలా వీరి చీకటి సంసారం రోజుల నుంచి నెలల గడిచింది. ఈ నేపథ్యంలోనే ఆ మహిళ తన ముగ్గురు పిల్లల కంటే ప్రియుడితో ఉండేందుకే మొగ్గు చూపింది. ఎలాగైన తన ముగ్గురు కూతుళ్లను అడ్డు తొలగించాలనుకుంది. ఇదే విషయాన్ని తన ప్రియుడితో చెప్పింది. దీంతో ఇద్దరు సరేనంటూ ఓ మాస్టార్ ప్లాన్ కు తెర లేపారు. అయితే ఆ మహిళ తన ప్రియుడితో చేతులు కలిపి తన ఇద్దరు కూతుళ్లను ఒక్కొక్కరి చొప్పున రూ. 4 లక్షలకు రాజస్థాన్ కు చెందిన ఓ వ్యక్తికి అమ్మేశారు.
అనంతరం 12 ఏళ్ల కూతురిని సైతం రూ.1.75 లక్షలకు మరో వ్యక్తికి విక్రయించి అనంతరం ఆ బాలికకు ఓ వ్యక్తితో పెళ్లి చేశారు. ఇలా అమ్మగా వచ్చిన డబ్బులతో ఆ మహిళ ఎవరికీ కనిపించకుండా పోయి ప్రియుడితో జల్సాలు చేసింది. ఇక కొన్ని రోజుల తర్వాత ఆ ముగ్గురు బాలికలు విక్రయం చేసిన వారి నుంచి తప్పించుకుని మెల్లగా తన తాత వద్దకు వెళ్లి జరిగిన దారుణాన్ని వివరించారు. తన మనవరాళ్లపై కోడలు ఇంతకు తెగించిందా అంటూ ఆ కోడలిపై మామ ఒంటి కాలుపై లేచాడు. అనంతరం కోడలు చేసిన దారుణంపై మామ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితులను అదుపులోకి తీసుకోగా.. ఉన్నట్టుండి పోలీసుల చెర నుంచి ఆ నిందితులు పరారయ్యారు. దీంతో మరింత అలెర్ట్ అయిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమవుతోంది.