మన దేశంలో హత్యలు, అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇక గతంలో నమోదైన క్రైమ్ హిస్టరీని తిరగేస్తే ఇందులో వివాహేతర సంబంధాలు, ప్రేమ వ్యవహారాల కారణంగా ఈ దారుణాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇకపోతే ఈ రోజుల్లో కొందరు.. భర్తను కాదని భార్య, భార్యను కాదని భర్త ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ చివరికి హత్యలు, ఆత్మహత్యలతో జీవితాన్ని ముగింపు పలుకుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ వ్యక్తి భార్యను కాదని తన సోదరుడి భార్యతో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నాడు. ప్రియురాలితో ఆ వ్యక్తి బెడ్ రూంలో నగ్నంగా ఉండగా సడెన్ గా అతని కొడుకు ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం.
అది మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లా బరోథా ప్రాంతం. ఇక్కడే మోహన్ లాల్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి ఓ మహిళతో చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి మోహన్ లాల్ కు చౌహాన్ (15) అనే కుమారుడు జన్మించాడు. ప్రస్తుతం అతడు 8వ తరగతి చదువుతున్నాడు. ఇదిలా ఉంటే తండ్రి మోహన్ లాల్ తన సోదరుడి భార్య అయిన ఆశా భోంస్లేతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. అలా భార్యకు తెలియకుండా మోహన్ లాల్ తన ప్రియురాలితో చీకటి కాపురాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే డిసెంబర్ 5న ఇటీవల మోహన్ లాల్ తన ప్రియురాలు ఆశా భోంస్లేతో బెడ్ రూంలో నగ్నంగా ఎంజాయ్ చేస్తూ ఉండగా మోహన్ లాల్ కొడుకు చౌహాన్ ఎంట్రీ ఇచ్చాడు. తండ్రి నగ్నంగా ప్రియురాలితో ఉండడం చూసి కొడుకు ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు.
ఇది చూసిన తండ్రికి, ఆయన ప్రియురాలికి ఒక్కసారిగా చెమటలు పట్టాయి. ఈ విషయాన్ని కొడుకు ఎవరికైన చెబుతాడేమోనని భయంతో ఊగిపోయాడు. ఇక ప్రియురాలు మాత్రం ఎలాగైన చౌహాన్ ను చంపాలని, లేకుంటే మన పరువు పోతుందని ప్రియుడుకి చెప్పింది. ఇది విన్న మోహన్ లాల్ నిజమేనంటూ ఇద్దరు కలిసి అదే రోజు చౌహాన్ ను దారుణంగా హత్య చేశారు. కాళ్లు, చేతులు విరిగేలా దాడి చేసి శవాన్ని నిర్మానుష్య ప్రాంతంలో పడేశారు. అలా రెండు రోజులు గడిచాక.. గుర్తు తెలియని బాలుడి శవం ఉందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని పరిశీలించారు. ఇక అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే పోలీసుల విచారణలో ముందుగా మృతుడి తండ్రి మోహన్ లాల్ ను విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి. ప్రియురాలితో ఉండగా నా కొడుకు చూశాడని, ఆ విషయాన్ని ఎవరికైనా చెబుతాడనే భయంతోనే చంపేశానని తండ్రి ఒప్పుకున్నాడు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు తండ్రిని అరెస్ట్ చేశారు.