Crime News: చేతిపంపులోంచి మద్యం రావటం ఏంటని అశ్చర్యపోతున్నారా? అవును.. ఓ ఇంట్లోని చేతిపంపులోంచి మద్యం వచ్చింది. ఆ చేతి పంపును వాడిన పోలీసులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. చేతి పంపులోంచి మందు రావటం ఏంటని అనుకున్నారు. తర్వాత విషయం తెలిసి నోరళ్ల బెట్టారు. ఇంతకీ సంగతేంటంటే.. మధ్యప్రదేశ్, దతియాలోని సివిల్ లైన్స్ పోలీసులకు ఓ ఇంట్లో భారీగా మద్యం నిల్వలు ఉన్నట్లు సమాచారం అందింది. వెంటనే వాళ్లు ప్రకాశ్ నగర్ కంజర్ డేరా ప్రాంతంలోని వినోద్ కంజర్ అనే వ్యక్తి ఇంటికి రైడ్‌కు వెళ్లారు. అయితే, ఆ ఇంట్లో ఎలాంటి మద్యం నిల్వలు వారికి కనిపించలేదు. అంతా వెతికి వేశారిపోయారు. ఇన్‌ఫార్మర్ తప్పుడు సమాచారం ఇచ్చాడని తిట్టుకున్నారు. చివరగా అక్కడ ఉన్న ఓ చేతిపంపు దగ్గరకు వెళ్లి దాన్ని వాడటం మొదలుపెట్టారు.
అయితే, ఆ చేతిపంపులోంచి నీళ్లకు బదులు మందు రావటం మొదలైంది. దీంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. ఆ చేతిపంపును తొలగించి చూడగా.. దాని కింద పెద్ద మొత్తంలో మద్యం నిల్వల ట్యాంకు బయటపడింది. వినోద్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న అతడికోసం గాలిస్తున్నారు. కాగా, మధ్యప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మద్యం చాలా అవసరమని వినోద్ భావించాడు. అక్రమంగా పెద్ద మొత్తంలో మద్యాన్ని కొనుగోలు చేశాడు. దాన్ని ట్యాంకులో పోసి ఇంటి బయట ఉన్న భూమిలో పాతిపెట్టాడు. దాని మీద ఓ చేతిపంపు ఏర్పాటుచేశాడు. అవసరం ఉన్నప్పుడు ఆ చేతిపంపు ఉపయోగించి మందును వాడుకునే వాడు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Madhya Pradesh: నా భర్త నాతో శృంగారం చేయడం లేదు.. నేను ఎంత ప్రయత్నించినా!