చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తిరుపతి రేణిగుంట పట్టణంలో నివాసం ఉంటున్న రవిచంద్రన్.. భార్య వసుంధర చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. భర్త అక్రమ సంబంధాన్ని సహించలేకపోయిన భార్య ఆగ్రహంతో ఏకంగా అతడిని హత్య చేసి తలను తీసుకొని పోలిస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది.
వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా రేణిగుంట పట్టణంలోని పోలీస్ లైన్ వీధిలో రవిచంద్రన్(53), వసుంధర దంపతులు నివాసం ఉంటున్నారు. కొన్నేళ్లపాటు సాఫీగా సాగిన వీరి కాపురంలో వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది. వేరే మహిళతో ఎఫైర్ పెట్టుకున్న రవిచంద్రన్ భార్యను నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టాడు. ఈ విషయంపై గురువారం ఉదయం భార్యాభర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో విచక్షణ కోల్పోయిన వసుందర కత్తితో అతి దారుణంగా పీక కోసి హత్య చేసింది. అనంతరం తలను వేరు చేసి సంచిలో వేసుకొని స్తానిక పోలీసుస్టేషన్లో లొంగిపోయింది.
ఇది కూడా చదవండి : అనుమానం- పెనుభూతం: బంగారంలాంటి సంసారాన్ని నాశనం చేసుకున్న ప్రబుద్ధుడు
వసుంధర భర్త తలను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనతో రేణిగుంట ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనతో నిర్ఘాంతపోయిన పోలీసులు నిందితురాలిని వెంటపెట్టుకొని ఘటనాస్థలికి వెళ్లారు. హత్య జరిగిన తీరును పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలకు తరలించారు.ఈ మేరకు కేసు నమోదు చేసిన పొలిసులు దర్యాప్తు చేస్తున్నారు.