మరికొన్ని గంటల్లో పెళ్లి. వరుడు కుటుంభికులు పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. కట్ చేస్తే.. వరుడి ఇంటికి చేరుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమంగా మారింది.
ఇతని పేరు సాయి. కారు డ్రైవర్ గా పని చేసేవాడు. అయితే, ఈ యువకుడికి స్థానికంగా ఉండే ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ గత నాలుగేళ్లుగా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. నువ్వు లేక నేను లేను అన్నట్లుగా కలిసిపోయారు. కానీ, ఇతగాడు నకిలీ ప్రేమతో నటిస్తాడని మాత్రం ఆ యువతి అస్సలు ఊహించలేదు. ఈ క్రమంలోనే ఆ యువకుడు ప్రియురాలికి తెలియకుండా మరో యువతితో పెళ్లికి రెడీ అయ్యాడు. కట్ చేస్తే, క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. అసలేం జరిగిదందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. కోమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా కోటాల మండలంలోని ఓ ఊరు. ఇదే గ్రామంలో ఏటకారి సాయి అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతడు స్థానికంగా కారు డ్రైవర్ గా పని చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే ఇతనికి ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువతి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. అలా వీరి ప్రేమాయణం ఏకంగా 4 ఏళ్ల పాటు కొనసాగింది. ఇన్నేళ్ల కాలంలో సాయి తన ప్రియురాలితో అనేక సార్లు శారీరకంగా కలిశాడు. దీంతో ఆ యువతి గర్భం దాల్చింది. ఇక సాయికి సాయికి ఏం చేయాలో తెలియక ప్రియురాలికి అబార్షన్ చేయించాడు. ఇదే విషయం ఇరువురి తల్లిదండ్రులకు తెలిసింది.
అప్పటి నుంచి సాయి ప్రియురాలితో మాట్లాడడం మానేశాడు. అలా కొన్ని రోజులు గడిచింది. ఈ క్రమంలోనే సాయి మరో యువతితో పెళ్లికి సిద్దమయ్యాడు. వివాహానికి అన్ని ఏర్పాట్లు చేశారు. మరి కొన్ని గంటల్లో పెళ్లి అనగా ఈ విషయం సాయి ప్రియురాలికి తెలిసి షాక్ గురైంది. ఇక చేసేదేం లేక స్థానిక పోలీసులను ఆశ్రయించింది. వెంటనే పోలీసులు పెళ్లి కొడుకు ఇంటికి వెళ్లారు. వారిని చూసి సాయి ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ఆ తర్వాత పోలీసులు సాయిని అరెస్ట్ చేశారు. అనంతరం అత్యాచారం వేధింపులతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.