ఈ రోజుల్లో చాలామంది గట్టుచప్పుడు కాకుండా గలీజ్ దందాకు శ్రీకారం చుడుతున్నారు. అందమైన అమ్మాయిలను నమ్మించి ముగ్గులోకి దింపుతున్నారు. ఆ తర్వాత కొంత రేటు ఫిక్స్ చేసుకుని అన్ని పనులు దగ్గురుండి చేయిస్తున్నారు. ఇలా అనేక చాలా మంది కేటుగాళ్లు గుట్టుచప్పుడు కాకుండా ఈ చీకటి బజినెస్ కు తలుపులు బార్ల తెరిచి అమ్మాయిలతో డబ్బులు కూడబెట్టుకుంటున్నారు. అచ్చం ఇలాగా తాజాగా ఓ వ్యక్తి ప్రయత్నాలు చేసి అడ్డంగా దొరికిపోయాడు. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? వాళ్లు చేస్తున్న గలీజ్ దందా ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన ప్రాంతం. జనగాం జిల్లాకు చెందిన మడసి రమేష్ కుమార్ అనే వ్యక్తి గత కొంతకాలంగా ఇక్కడే నివాసం ఉంటున్నాడు. అయితే ఇతను గుట్టుచప్పుడు వ్యభిచారాన్ని నడిపిస్తున్నాడు. స్థానికంగా ఉండే క్రాస్ రోడ్డులో మూసివేసిన ఓ పాడుబడ్డ ఫ్యాక్టరీని వేదికగా చేసుకుని ఈ దుకాణానికి తెరలేపాడు. దీంతో కాగజ్ నగర్, ఆసిఫాబాద్ ప్రాంతాలకు చెందిన కొందరు మహిళలకు ఈ కేటుగాడు ఎరవేస్తాడు. ఇక నమ్మించి ఓ రేటు ఫిక్స్ చేసి విటులను రప్పిస్తాడు.
అలా వచ్చిన చాలా మంది మహిళలతో గత కొంత కాలంగా సీక్రెట్ గా వ్యభిచారాన్ని నిర్వహిస్తూ డబ్బులు కూడా బెట్టుకుంటున్నాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇది తెలుసుకున్న పోలీసులు పక్కాప్లాన్ తో కదిలి.. ఆ పాడుబడ్డ ఫ్యాక్టరీపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వ్యభిచార నిర్వాహకుడు రమేష్ కుమార్ తో పాటు మరో ఇద్దరు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే ఘటన స్థానికంగా తీవ్రచర్చనీయాంశమవుతోంది.