ఈ యువతి పేరు దస్రుబాయి. వయసు 22 ఏళ్లు. కొంత వరకు చదువుకున్న ఆ యువతి వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చింది. ఇదిలా ఉంటే శుక్రవారం ఆ యువతి పంట చేనుకు కాపలాగా వెళ్తున్నానని ఇంట్లో తల్లికి చెప్పి వెళ్లింది. అయితే సాయంత్రం అయినా కూతురు ఇంటికి రాకపోవడంతో తల్లి ఖంగారుపడింది. వెంటనే పొలంలోని పంట చేనులోకి వెళ్లి చూడగా కూతురు ఊహించని స్థితిలో కనిపించింది. ఈ సీన్ ను చూసిన తల్లి ఒక్కసారిగా షాక్ కు గురైంది. కూతురు తల్లికి ఏ స్థితిలో కనిపించింది. అసలు ఏం జరిగిందనేది తెలుసుకోవాలనుందాం? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.
అది కొమురంభీం జిల్లా పెంచికల్ పేట మండలం కమ్మర్ గాం గ్రామం. ఇక్కడే దస్రుబాయి(22) అనే యువతి నివాసం ఉంటుంది. పొలం పనుల్లో ఆ యువతి తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటూ వస్తుంది. ఈ క్రమంలో దస్రుబాయి ఇటీవల పొలానికి కాపలాగా వెళ్తున్నానని ఇంట్లో తల్లి శకుంతలకి చెప్పి వెళ్లింది. కట్ చేస్తే సాయంత్రం సమయం 6 గంటలు అవుతుంది. ఇక పంట చేనుకు కాపలాగా ఉంటానని చెప్పి వెళ్లిన కూతురు ఇంటికి రాలేదు. దీంతో తల్లికి ఎందుకో అనుమానం వచ్చింది. ఖంగారుపడి తల్లి వెంటనే పంట చేనులోకి వెళ్లింది. అయితే శకుంతల పంట చేనులోకి వెల్లి చూడగా కూతురు నోట్లో నురుగులతో పడిపోయి కనిపించింది. ఏం జరిగిందని కూతురును లేపే ప్రయత్నం చేసింది.
కానీ కొద్దిసేపటి తర్వాత తల్లికి తెలిసింది ఏంటంటే?… కూతరు చనిపోయిందని. దీంతో తల్లి ఒక్కసారిగా గుండెలు పగిలేలా ఏడ్చింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ యువతి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత శకుంతలం కుటుంబ సభ్యులు అంత్యక్రియలు జరిపారు. ఇక పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మాత్రం ఆ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. అనంతరం తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.