పిల్లలు ఉన్నత చదువులు చదవాలని తల్లిదండ్రులు ఆశపడటం సహజం. ఆ తరువాత వారు చదివి బాగుపడతారా! బాగుపడరా అన్నది వాళ్ల విజ్ఞత. ఇప్పుడు ఇవన్నీ.. ఎందుకంటే.. బిడ్డ కాలేజ్ కు వెళ్లి పాఠాలు వింటాడనుకుంటే.. ఆ బడుద్ధాయి పాఠాలు పక్కనపెట్టి.. అవి చెప్పే ప్రొఫెసర్ ప్రైవేట్ పిక్స్ చూస్తూ కూర్చున్నాడు. పోనీ, ఇంతటితో ఊరుకున్నాడా! ఇంటికొచ్చాక కూడా అదే పని. ఇలా.. చూస్తూ.. చూస్తూ.. ఒకరోజు తల్లిదండ్రులకు అడ్డంగా దొరికిపోయాడు. ఆ తల్లిదండ్రులు ఊరుకున్నారా? అంటే.. లేదు. మా వాడు చూడడంలో ఎలాంటి తప్పు లేదు. అసలు అలాంటి ఫొటోస్.. ప్రొఫెసర్ ఎందుకు పెట్టింది అంటూ నలుగురిలో పంచాయతీ పెట్టారు. ఇది కోల్‌కతాలోని సెయింట్ జేవియర్ యూనివర్సిటీకి చెందిన ఘటన.
కోల్‌కతా, పశ్చిమ బెంగాల్ లోని సెయింట్ జేవియర్ యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్.. తన బికినీ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసింది. ఆ అకౌంట్ కూడా ప్రైవేట్ అకౌంట్. ఎవరు చూడడానికి వీలుండదు. ఎలానో ఆ ఫొటోలు అయితే బయటకు వచ్చాయి. ఆ నోటా.. ఈ నోటా పాకుతూ.. ఓ డిగ్రీ విద్యార్థి చెవిన పడింది. ఈ బడుద్ధాయి.. మనసులో చూడాలని ఆశ పుట్టడంతో.. ఒకసరి ఓపెన్ చేసి చూశాడు. అంతటితో ఊరుకున్నాడా! లేదు.. ఇంటికెళ్లి మళ్ళీ ఓపెన్ చేశాడు. ఈసారి వెనుక నుంచి పేరెంట్స్ కూడా చూశారు. వెంటనే ఆ ఫోటోల గురుంచి యూనివర్సిటీ యాజమాన్యానికి ఓ లేఖ రాశారు.
“తమ 18 ఏళ్ల కుమారుడికి చదువు చెబుతున్న ప్రొఫెసర్ బికినీ పిక్స్ చూశాడని, ఆమె అలా పొట్టి డ్రెస్సుల్లోని ఫొటోలను సోషల్ మీడియాలో బహిరంగ పరచడం దారుణమని, తల్లిదండ్రులుగా తమకు సిగ్గుచేటుగా ఉందని పేర్కొన్నారు. ఇన్నాళ్లు తమ కుమారుడిని అలాంటివి చూడకుండా కాపాడామని, కానీ, ఆమె పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లో అసభ్యంగా కనిపిస్తున్న ఫొటోలు పోస్టు చేసి.. తమ కుమారుడు చూసేలా చేసిందని.. ఆ లెటర్ సారాంశం..
ఆ లేఖ తర్వాత యూనివర్సిటీ యాజమాన్యం ప్రొఫెసర్ చర్యపై కమిటీ వేసింది. ఆమె కమిటీ ముందు హాజరవ్వగా.. ఆమె పై వచ్చిన ఫిర్యాదు లేఖను చదివి వినిపించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా దిగిపోవాలని ఆమెపై ఒత్తిడి చేసారు. ఆమె రాజీనామా చేసింది. అంతటితో అయిపోయిందా! లేదు.. బలవంతంగా రాజీనామా చేసేలా ఒత్తిడి చేసిన యూనివర్సిటీ తనకు చేసిన నష్టానికి రూ. 99 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తోంది.
“వారు అసభ్యంగా ఉన్నదని చెబుతున్న ఫొటో కేవలం పోస్టు కాదని, అదొక స్టోరీ అని ఆమె వాదిస్తోంది. అది కూడా ఆ యూనివర్సిటీ తనకు ఆఫర్ ఇవ్వడానికి ముందే ఆ ఫొటో పోస్టు అయిందని తెలిపింది. తన ప్రొఫైల్ ప్రైవేట్ అని, ఆ ఫొటోలు బయటకు ఎలా వెళ్లాయో తనకు తెలియడం లేదని ఆమె చెప్తోంది. డ్రెస్ కోడ్, కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నదని తనకు తెలుసనీ.. అది కేవలం యూనివర్సిటీ ప్రాంగణం వరకే పరిమితంగా ఉంటాయని గట్టిగా సమాధానం చెప్తోంది.తక్షణమే కాలేజీ యాజమాన్యం తనకు క్షమాపణలు చెప్పాలని, తనకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. అవసరమైతే తాను కలకత్తా హైకోర్టును కూడా ఆశ్రయించబోతున్నట్టు పేర్కొంది. ఈ బికినీ వ్యవహారంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
A student of St. Xavier’s Kolkata was recently caught looking at a pic of a Prof in her swimsuit (taken from her private IG). His father sent a letter to the uni condemning HER for his son’s leching.
Prof was forced to resign in a strikingly humiliating manner.
2022… damn. pic.twitter.com/2RNLnXBd0p
— Sukhnidh ⚆ _ ⚆ (@skhndh) August 8, 2022
ఇదీ చదవండి: దారుణం.. కవల పిల్లల నోట్లో విషం పోసి!
ఇదీ చదవండి: లైంగిక దాడి చేసి హత్య చేసిన యువకుడు.. ఒక చిన్న పొరపాటుతో..