వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా తయారయ్యారు. కలిసి సినిమాలు, షికారులకు తిరిగారు. ఇక చివరికి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఇక మతాలు వేరైనా యువకుడు ప్రేమించిన యువతినే పెళ్లి చేసుకున్నాడు. కానీ విషాదం ఏంటంటే? ఆ ప్రేమికుడు పెళ్లైన నెల రోజులకే రైలు పట్టాలపై శవమై కనిపించాడు. గతంలో జరిగిన ఈ కేసులో ఇప్పటికీ కూడా మిస్టరీ వీడనే లేదు. అసలు ఈ ప్రేమ కథలో ఏం జరిగింది? ప్రియుడుని హత్య చేశారా? లేక ఆత్మహత్య చేసుకున్నాడా? అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పడు తెలుసుకుందాం.
కోల్ కతాలో రాకేష్ ( పేరు మార్చాం) అనే యువకుడు గ్రాఫిక్ డిజైనర్ గా పని చేస్తున్నాడు. ఇలా తనంతట తాను ఉద్యోగం చేసుకుంటున్న క్రమంలోనే ఇతనికి వెన్నెల ( పేరు మార్చాం) అనే ఓ వ్యాపారీ కూతురు పరిచయం అయింది. ఈ పరిచయంతోనే ఇద్దరు తరుచు మాట్లాడుకోవడం చేసేవారు. అలా కొంత కాలానికి వీరి పరిచయం ప్రేమగా మారింది. అలా ఇద్దరు కొన్నాళ్ల పాటు ప్రేమ విహారంలో తేలియాడుతూ ఉన్నారు. అలా కొన్నేళ్ల పాటు వీరి ప్రేమాయణం కొనసాగుతూ వచ్చింది. ఇక చివరికి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే ఇద్దరివీ మతాలు వేర్వేరు కావడంతో ఈ ప్రేమికులు కొద్ది మంది సమక్షంలో 2007 ఆగస్టు 18న ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు.
ఇక పెళ్లైన అనంతరం రాకేష్ తన భార్యను తన ఇంటికి తీసుకెళ్లాడు. యువకుడు తల్లిదండ్రులు ఈ నవ దంపతులను ఆశీర్వదించారు. అయితే మరుసటి రోజు రాకేష్ యువతి తల్లిదండ్రుల నుంచి మమ్మల్ని రక్షించాలంటూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువకుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నపోలీసులు ఇద్దరి తల్లిదండ్రులను పిలిపించి యువతి తల్లిదండ్రులను ఒప్పించే ప్రయత్నం చేశారు. అయితే ఒప్పకున్నట్లు నటించిన యువతి కుటుంబ సభ్యులు.. వెన్నెలను ఒక వారం రోజుల పాటు మా ఇంటికి తీసుకెళ్లి, ఆ తర్వాత తిరిగి రాకేష్ వద్దకు పంపిస్తామని వెన్నెల మేనమామ రాకేష్ ను ఒప్పించి తీసుకెళ్లాడు.
ఇక వారం రోజులు అయినా.. వెన్నెలను తిరిగి పంపించకపోవడంతో రాకేష్ సెస్టెంబర్ 21న వెన్నెల ఇంటికి వెళ్లాడు. అయితే అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, అదే రోజు స్థానిక రైల్వే పట్టాలపై రాకేష్ శవమై కనిపించాడు. ఇదే ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై రాష్ట్ర పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి ఈ కేసును అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. యువతి తల్లిదండ్రులు హత్య చేసి ఉండడంతో పాటు, పోలీసులే ఆ యువకుడిని ఆత్మహత్యకు ప్రేరేపించారన్న అనుమానాలు కూడా లేకపోలేదు. ఈ ఘటనపై సీబీఐ సంస్థ సైతం దర్యాప్తు చేపట్టింది. అయితే ఇప్పటికీ కూడా రాకేష్ ది హత్యనా, లేక ఆత్మహత్యనా అనే విషయంలో మాత్రం పోలీసులకు ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఈ కేసుపై తాజాగా సుప్రీం కోర్టు సైతం కీలక ఆదేశాలు జారి చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరోసారి తెరపైకి వచ్చిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమవుతోంది.