ఖమ్మంలోని ఓ కాలేజీలో చదువుకుంటున్న మానస అనే యువతి ఆదివారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ యువతి ఆత్మహత్య ఇదే కారణమని పోలీసులు భావిస్తున్నారు.
మెడికో స్టూడెంట్ ప్రీతి ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజుల కిందట ఈ అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమంగా మారింది. అయితే, ఈ ఘటన మరువక ముందే మరో మెడికో స్టూడెంట్ బలవన్మరణానికి పాల్పడింది. ఆదివారం చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. తాను ఉంటున్న హాస్టల్ గదిలోనే ఆ యువతి ఒంటిపై పెట్రోలో పోసుకుని ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు తీసుకుంది. ఇంతకు ఈ యువతి ఆత్మహత్యకు కారణం ఏంటంటే?
అసలేం జరిగిందంటే?
వరంగల్ కు చెందిన సముద్రాల మానస (22) అనే యువతి ఖమ్మంలోని ఓ మెడికల్ కాలేజీలో బీడీఎస్ నాలుగో సంవత్సరం చదువుతుంది. ఈ యువతి చదువుల్లో చాలా చురుగ్గా ఉండేది. ఎప్పుడు నవ్వుతూ అందరితో సంతోషంగా గడిపేది. ఇదిలా ఉంటే.. ఆదివారం సాయంత్రం మానస హాస్టల్ నుంచి బయటకు వెళ్లింది. ఆ యువతి తిరిగి హాస్టల్ కు వచ్చే క్రమంలో ఎవరికీ కనిపించకుండా ఓ బాటిల్ లో పెట్రోల్ తెచ్చుకుంది. ఆ తర్వాత హాస్టల్ లోని తన గదికి వెళ్లి లోపలి నుంచి గడియ పెట్టుకుంది. అనంతరం మానస ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న తోటి స్నేహితులు హాస్టల్ నిర్వాహకులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఆ నిర్వాహకులు మంటలను పూర్తిగా ఆర్పివేశారు. కానీ, ఫలితం లేకపోవడంతో మానస 80 శాతం కాలిన గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రి మార్చూరికి తరలించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మానస ఆత్మహత్యకు కారణం ఇదేనా?
ఖమ్మం మెడికో స్టూడెంట్ మానస ఆత్మహత్యకు గల కారణం తెలుసుకోవడానికి పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే, పోలీసులు ప్రాథమి దర్యాప్తులో మాత్రం కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. వరంగల్ కు చెందిన మానసకు చిన్నప్పుడే తల్లి మరణించింది. ఆ తర్వాత తండ్రి మరో మహిళను వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆ యువతి తండ్రి వద్దే ఉండేది. ఇకపోతే మానస తండ్రి ఇటీవల మరణించాడు. తండ్రి మరణంతో ఆ యువతి తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తుంది. చిన్నప్పుడే తల్లి, ఇప్పుడు తండ్రి చనిపోవడంతో మానస తల్లిదండ్రులు లేని అనాథగా మారిపోయింది. వీటన్నిటినీ మానస భరించలేకపోయిందని, దీని కారణంగానే ఆమె బలవన్మరణానికి పాల్పడిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.