పైన కనిపిస్తున్న యువతి, యువకుడు ఇటీవల ఓ హోటల్ కు వెళ్లారు. వీరితో పాటు 58 ఏళ్ల వృద్ధుడు కూడా వెళ్లినట్లుగా అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కానీ, ఆ హోటల్ గదిలో జరిగింది తెలిస్తే మాత్రం షాక్ గురవుతారు.
పైన కనిపిస్తున్న యువకుడి పేరు శిబిల్, యువతి పేరు ఫర్హానా. వీరికి చాలా ఏళ్లుగా పరిచయం ఉన్నట్లు సమాచారం. దీంతో ఇద్దరు కలిసి మెలిసి సంతోషంగా ఉండేవారు. ఇదిలా ఉంటే, ఇటీవల వీరిద్దరూ ఓ హోటల్ కు వెళ్లారు. వీరితో పాటు ఓ వృద్ధుడు కూడా వెళ్లాడు. కానీ, ఆ తర్వాత జరిగిన దారుణం తెలిస్తే మాత్రం మీకు వెన్నులో వణుకు పుట్టక తప్పదు. అవును.. మీరు విన్నది నిజమే. అసలు నిజాలు తెలుసుకుని పోలీసులు సైతం నోళ్లు వెళ్ల బెట్టారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. కేరళలోని మలప్పురం జిల్లా తిరూర్ కు చెందిన సిద్ధిఖ్ (58) అనే వ్యక్తి కోజికోడ్ లో ఓ హోటల్ ను నడిపిస్తున్నాడు. ఇక్కడే బిజినెస్ చేస్తూ కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. ఇదిలా ఉంటే, ఇతని హోటల్ లో శిబిల్ (22) అనే యువకుడు గత 15 రోజులు పని చేశాడు. ఇతని ప్రవర్తన నచ్చకపోవడంతో సిద్ధిఖ్ శిబిల్ ని పనిలో నుంచి తొలగించాడు. దీంతో శిబిల్ సిద్ధిఖ్ పై కోపం పెంచుకున్నట్లు సమాచారం. ఇకపోతే, సిద్ధిఖ్ ఉంటున్న హోటల్ లో ఈ నెల 18న శిబిల్ రెండు రూమ్ లు బుక్ చేశాడు. అదే రోజు శిబిల్ తో పాటు అతని స్నేహితురాలైన ఫర్హానా (18)తో కలిసి హోటల్ కు వెళ్లారు. అయితే సిద్ధిఖ్ తో పాటు శిబిల్ అతని ఫ్రెండ్ ఫర్హానా ముగ్గురు ఒకేసారి హోటల్ లోకి వచ్చిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
ఇక ఆ హోటల్ లోకి వెళ్లిన తర్వాత శిబిల్ ఆమె ప్రియురాలితో కలిసి సిద్ధిఖ్ ను దారుణంగా హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. మరుసటి రోజు ఆ యువ జంట సిద్ధిఖ్ ను అతి కిరాతకంగా అతని శరీర భాగాలను ముక్కలు ముక్కులగా నరకి అన్నిటినీ ఓ సూట్ కేసులో నింపుకున్నారు. అనంతరం ఆ సూట్ కేసును తీసుకుని పాలక్కాడి జిల్లా అట్టప్పాడి పాస్ సమీపంలో అటవీ ప్రాంతంలో విసిరేశారు. సిద్ధిఖ్ కు అతని కుమారుడు ఎన్నో సార్లు ఫోన్ చేశాడు. అస్సలు స్పందించలేదు. కాగా, అతని అకౌంట్ నుంచి పెద్ద మొత్తం డబ్బులు డ్రా చేసినట్లుగా అతని కుమారుడికి మెసేజ్ లు కూడా వచ్చాయి. దీంతో అనుమానం వచ్చిన మృతుడి కుమారుడు స్థానిక పోలీసులు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు సిద్ధిఖ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు అతడు ఉంటున్న హోటల్ లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. అయితే ఈ నెల 19న సిద్ధిఖ్ తో పాటు హోటల్ లోకి శిబిల్ తో పాటు ఓ యువతి వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. మొత్తానికి పోలీసులు నిందితులుగా ఉన్న శిబిల్, ఫర్హానాను శుక్రవారం చెన్నైలో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, శిబిల్ ను ఉద్యోగం నుంచి తీసేసినందుకే సిద్ధిఖ్ ను హత్య చేశాడా? లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.