కేరళ నరబలి ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా సంచనలంగా మారుతున్న విషయం తెలిసిందే. మూడ నమ్మకాల్లో కూరుకుపోయిన ఆ దంపతులు రాత్రికి రాత్రికి ధనవంతులు అవ్వాలని ఏకంగా ఇద్దరు అమాయక మహిళల ప్రాణాలను పొట్టనబెడుకున్నారు. ఇక ఆ దంపతులు ఇంతటితో ఆగకుండా మృగాలుగా మారి వారి శవాలని వండుకుని మరీ పీక్కుతిన్నారు. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అయితే ఈ దారుణ ఘటనలో తాజాగా మరో షాకింగ్ విషయాలు బయటకొస్తున్నాయి. ఈ దంపతులు ఇంతటి దారుణ చర్యకు పాల్పడడానికి కేరళలో ఉన్న లాటరీ టికెట్స్ విధానమే ఇంతటి కీచక చర్యకు కారణం అయిందానే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇకపోతే కేరళలో చాలా మంది లాటరీ టెకెట్స్ కొనుగోలు చేయడానికి ఉత్సాహాన్ని చూపిస్తుంటారు. మన అదృష్టం కలిసొస్తే రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారిపోవచ్చిన నమ్ముతుంటారు. దీంతో చాలా మంది లాటరీ టికెట్స్ ను కొనుగోలు చేస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో కేరళలో నివసించే అనూప్ అనే ఓ సాధారణ ఆటో డ్రైవర్ గతంలో ఓ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. అలా తాను కొనుగోలు చేసిన ఆ లాటరీ టికెట్స్ లో చివరికి విజేతగా నిలిచాడు. దీంతో అనూప్ రూ.25 కోట్ల ప్రైజ్ మనీని దక్కించుకున్నాడు. ఇలా రాత్రికి రాత్రి కోటీశ్వరులుగా మారిపోవాలని కేరళలోని ప్రతీ ఒక్కరు లాటరీ టికెట్స్ కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపిస్తుంటారు.
అయితే అచ్చం ఇలాగే ఆలోచించిన భగత్ సింగ్, లైలా అనే దంపతులు ధనవంతులుగా మారిపోవాలనుకున్నారు. ఈ దంపతులకు మూడ నమ్మకాలను నమ్మతుంటారు. రాత్రికి రాత్రి ధనవంతులు అవ్వాలని అనుకున్నారు. దీని కోసం మహ్మద్ షఫీ అనే ఓ మాంత్రికుడిని కలిశారు. మేము ఉన్నపళంగా ధనవంతులం కావాలంటే ఏం చేయాలని అని అడిగారు. ఏం లేదు.., ఇద్దరు మహిళలను బలి ఇస్తే చాలు అంటూ ఓ సలహా ఇచ్చాడు. మాంత్రికుడి మాటలు నమ్మిన ఆ దంపతులు.. వీరికి తెలుసున్న లాటరీ టికెట్స్ కొనుగోలు చేసే ఇద్దరు మహిళలను ఇంటికి తీసుకొచ్చారు.
పూజలో పాల్గొంటే మీకు డబ్బులు ఇస్తామని నమ్మించారు. దీంతో నిజమేనని నమ్మిన ఆ మహిళలు వారి కోరినట్లుగా పూజలో పాల్గొన్నారు. దీంతో పక్కాప్లాన్ ప్రకారమే భగత్ సింగ్, లైలా దంపతులు, మహ్మద్ షఫీ ఆ ఇద్దరు మహిళల గొంతు కోసి చంపి నరబలి ఇచ్చారు. ఇక ఇంతటితో ఆగకుండా వారి శవాలను సైతం వండకుని పీక్కుతున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ దంపతులు ఇంతటి దారుణానికి కారణం ఒక్క లాటరీ టికెట్స్ విధానమే కారణమని పలువరు మేధావులు, విద్యావేత్తలు చర్చింకుంటున్నారు.