వాళ్లిద్దరు భార్యాభర్తలు. ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. నవ దంపతుల కాపురం సాఫీగా సాగుతుందని బంధువులంతా సంభపడ్డారు. అలా రోజుల నుంచి నెలలు గడిచాయి. ఈ క్రమంలోనే భర్త ప్రవర్తన మార్పొచ్చి రాక్షసుడిలా మారాడు. భర్త ఇలా మారతాడని భార్య అస్సలు ఊహించనేలేదు. కానీ భర్త యుముడిలా మారి కట్టుకున్న కొన్నాళ్లకే భార్యను దారుణంగా హత్య చేశాడు. ఇటీవల కేరళలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కేరళలోని అలప్పుజా. ఇదే ప్రాంతానికి చెందిన అనీష్, నిఖిత(25) భార్యాభర్తలు.పెద్దలు కుదిర్చిన సంబంధం కావడంతో ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. అలా పెళ్లైన కొన్ని రోజుల తర్వాత ఈ దంపతులు విదేశాల్లో స్థిరపడ్డారు. వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగుతున్న క్రమంలోనే భర్త అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ దంపతులు తిరిగి కేరళకు వచ్చారు. ఈ తరుణంలోనే భర్త భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయమై భార్యాభర్తల మధ్య తరుచు గొడవలు కూడా జరుగుతున్నాయి. దీంతో ఇటీవల మరోసారి దంపతుల మధ్య వివాదం రాజుకుంది.
కోపంతో ఊగిపోయిన భర్త అనీష్ మెటల్ ల్యాంప్ తో భార్య తలపై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన నిఖితను స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు. ఇక చికిత్స పొందిన నిఖిత ఇటీవల ఆస్పత్రిలో మరణించింది. కూతురు మరణ వార్త తెలుసుకున్న నిఖిత తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం నిఖిత కుటుంబ సభ్యులు భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇటీవల చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.